Friday, 3 June 2016

career courses బంగారు కెరీర్‌కు భద్రమైన కోర్సులు

ఇంజినీరింగ్.. ప్రపంచ గమనాన్ని మారుస్తున్న పదం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న సమూల మార్పులకు మూలం. కొత్త ఆవిష్కరణలు, సరికొత్త రూపకల్పనలు, వివిధ ఆకృతుల్లో నిర్మాణాలకు, సాంకేతిక-టెలికం రంగాల్లో నూతన ఒరవడులకు ఇది దారి చూపిస్తుంది. నేర్చుకోవాలనే తపన, ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి పరచడం, కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన, భవిష్యత్ తరాలకు మార్గనిర్ధేశనం చేయాలనుకునే వారికి చక్కని వేదిక ఇంజినీరింగ్. ప్రస్తుతం ఇంజినీరింగ్‌లో ఉన్న కోర్సుల్లో అత్యుత్తమమైన, ఎక్కువగా ఆదరణ ఉన్న కోర్సులు, వాటితో లభించే ఉద్యోగ అవకాశాలు, ఆయా కోర్సులను అందించే వర్సిటీలు, కాలేజీలు, వాటికి సంబంధించిన వివరాలు మీ కోసం...

students
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
-దేశంలో అత్యాధునిక టెక్నాలజీ వేగంగా అందుబాటులోకి వస్తున్నది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, రేడియోల వంటివి నిత్యజీవితంలో భాగంగా మారిపోయాయి. అత్యంత శక్తివంతమైన శాటిలైట్ల నుంచి అతిచిన్న ఐపాడ్ వరకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీర్ల కృషితోనే మనందరికి అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల కష్టపడే తత్వం, నేర్చుకోవాలనే తపన, ఏదైనా సాధించాలనే ఉత్సాహం ఉన్న నేటి తరం విద్యార్థులకు ఇంజినీరింగ్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ). దేశంలో వేగంగా విస్తరిస్తున్న కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిక్షిశమ నేటి విద్యార్థులకు మంచి అవకాశాలను అందించే అవకాశం ఉంది.

ఈసీఈ అంటే..
-ట్రాన్సిస్టర్లు, ఇంటిక్షిగేటెడ్ సర్కూట్లు, కంప్యూటర్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్కూట్ బోర్డులు (PCBS), ఎంపీ3 ప్లేయర్లు, సెల్‌ఫోన్లు, టీవీల వంటి రోజువారీ ఉపయోగించే పరికరాలను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీర్లు అభివృద్ధి చేస్తారు. తాము కోరుకున్న వస్తువులు పరిక్షిశమల నుంచి నేరుగా వినియోగదారుల వద్దకు చేరుతున్న ప్రస్తుత రోజుల్లో ఈ రంగానికి చెందిన ఇంజినీర్లు ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీల్లో తయారుచేసే వస్తువుల పనితీరు, భద్రత, ఇన్‌స్టాలేషన్ వంటివాటిని పరిశీలించి, ఆ పరికరాల పనితీరును ధ్రువీకరించాలి. అయితే ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లాజిక్ డిజైన్, ఫండమెంటల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, సిగ్నల్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, వీఎల్‌ఎస్‌ఐ, పవర్ ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.

ece ఈ విభాగాల్లో పనిచేయవచ్చు
-ఈసీఈ పూర్తిచేసిన తర్వాత చాలా రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా సిస్టమ్స్, సర్కూట్లు, కొత్త పరికరాలను రూపొందించడం లేదా ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు మన సామర్థాన్ని బట్టి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ ఏవియానిక్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్స్, టెలీకమ్యూనికేషన్స్, రేడియో, టీవీ, హాస్పిటల్ డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్ వంటి విభాగాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించవచ్చు.

ఇంకా ఈ బ్రాంచీలో..
-ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్కూట్స్ అండ్ మెషిన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆప్టికల్ సిస్టమ్స్ గురించి తెలుకోవచ్చు. వీటితోపాటు అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలు కూడా ఉంటాయి.

ఈసీఈ చేయాలంటే..
-ఇంటర్ లేదా 10+2లో ఎంపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) చేసి ఉండాలి. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాలకోసం నిర్వహించే ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించాలి. దీంతోపాటు జేఈఈ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ (వీఐటీ యూనివర్సిటీ)వంటి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా కూడా ఈసీఈ చేయవచ్చు.

ఈసీఈకి ప్రముఖ కాలేజీలు
-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మణిపాల్, బిట్స్-పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్, మోతీలాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-అలహాబాద్.

ఉద్యోగాలు
-ఈసీఈ పూర్తిచేసినవారు ప్రభుత్వరంగ, బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు. బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీవో, ఇస్రో, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మోటరోలా, టెక్‌మహీంద్ర, సిమన్స్, ఇంటెల్, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్, సామ్‌సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ బ్రాంచివారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
ఉన్నత విద్య
-బీటెక్‌లో ఈసీఈ పూర్తి చేసిన తర్వాత వివిధ స్పెషలైజేషన్లతో ఎంటెక్ చేయవచ్చు. అవి.. ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ బయోఇన్ఫర్మాటిక్స్, నానో టెక్నాలజీ, డిజిటల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్/సైబర్ సెక్యూరిటీ, బయోమెవూటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్.

Civil-Engineering సివిల్ ఇంజినీరింగ్
-నాటి ఈజిప్టు నుంచి నేటి నాగార్జునసాగర్ డ్యామ్, ఎక్స్‌వూపెస్ హైవే, సై్క వేలు, హైదరాబాద్ మెట్రోరైల్ (ఎలివేటెడ్ వే) వరకు ఎన్నో కట్టడాలకు కారణమైనది సివిల్ ఇంజినీరింగ్. పురాతన కాలం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఎత్తయిన కొండలపై ఉన్న చైనా గోడ, గోల్కొండ కోట, అత్యంత ఎత్తయిన టవర్ బుర్జ్ ఖలీఫా, మూడు గుట్టలను కలుపుతూ ఎక్కువ మొత్తంలో నీటిని ఒడిసి పట్టేలా నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ వంటివన్నీ సివిల్ ఇంజినీరింగ్ నుంచి వచ్చిన అపురూప కట్టడాలు. మరి ఇలాంటి నవ నూతన నిర్మాణాలను చేపట్టాలన్న ఆకాంక్ష ఉండి, కొత్తదనం చూపాలనే ఆలోచనలతో ఉన్నవారికి సరైన వేదిక సివిల్ ఇంజినీరింగ్ కోర్సు. కన్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్‌గా పిలిచే ఈ కోర్సు చేసిన వారికి భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, తెలంగాణ వంటి నూతన రాష్ట్రాల్లో ఇన్‌వూఫాస్ట్రక్చర్ రంగంలో చాలా అవకాశాలు ఉంటాయి.

కోర్ సబ్జెక్టులు
-కోర్సులో భాగంగా సర్వేయింగ్ (ల్యాండ్ అండ్ సర్వేయింగ్), మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కోస్టల్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్, బిల్డింగ్ టెక్నాలజీ, స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైన్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్, ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, జియోటెక్నికల్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ఫోరెన్సిక్ ఇంజినీరింగ్, అర్బన్ ఇంజినీరింగ్, కంట్రోల్ ఇంజినీరింగ్ తదితర అంశాలను చదవాల్సి ఉంటుంది.

ఈ కాలేజీల్లో చేస్తే...
-నిట్ వరంగల్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ, నిట్-ర్కూలా, ఢిల్లీ, కాలికట్, సిల్చర్ (SILCHAR), సర్దార్ వల్లాభాయ్ పటేల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-సూరత్ వంటి విద్యా సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో చదివిన వారికి నేరుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.


ఉన్నత విద్య..
-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్, వాటర్ రిసోర్స్, స్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ఎంటెక్ చేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలు
-నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణాలు అధికమవుతుండటంతో సివిల్ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి టాటా కన్సప్టూన్సీ ఇంజినీర్స్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇన్ఫ్రా, హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, జీఎంఆర్ గ్రూప్ సంస్థల్లో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు. వ్యక్తిగత నైపుణ్యం పెంచుకున్నట్లయితే కన్సప్టూంట్లుగా రాణించవచ్చు.

ece-panelఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
-ఒక రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ, పారిక్షిశామిక రంగాలే కీలకం. ఈ రెండు రంగాలకు విద్యుత్ ప్రధానమైనది. అసలు విద్యుత్‌తో అవసరంలేని రంగమంటూ ఏదీలేదని చెప్పవచ్చు. విద్యుత్ కొరత ఏర్పడితే ఆధునిక జనజీవనం స్తంభించిపోవడంతోపాటు ఆర్థికవ్యవస్థ తలకిందులవుతుంది. వ్యవసాయం మొదలు భారీ రాకెట్ల తయారీ వరకు ప్రతి రంగంలో విద్యుత్ ప్రధానమైనది. అందుకే ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. గృహావసరాలు, పరిక్షిశమలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం ఎలక్ట్రిక్ ఇంజినీర్ల ప్రధాన బాధ్యత.
-కోర్సులో భాగంగా ఐసీలు, ఇండక్టర్లు, కెపాసిటర్లు, రెసిస్టర్ల డిజైనింగ్, వాటి పని విధానం గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ సర్కూట్ల డిజైనింగ్, కంప్యూటర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ తయారీ వంటి అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ప్రధానంగా ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రికల్ మెషిన్లలో తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎలక్ట్రికల్ మెషినరీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ జనరేషన్, విద్యుత్ సరఫరా, ఎలక్ట్రికల్ కంట్రోలర్స్ ఇన్ ఫ్యాక్టరీస్, ట్రాన్స్‌ఫార్మర్స్, మోటార్ల తయారీ- వాటి నియంవూతణ వంటి అంశాల గురించి తెలుసుకోవచ్చు.
-ఈ కోర్సు ప్రధానంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లకు సంబంధించిన ఫండమెంటల్స్, ప్రిన్స్‌పుల్స్‌తో కూడి ఉంటుంది.

కోర్ సబ్జెక్టులు
-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ అండ్ మెషిన్స్, సర్క్యూట్ అనాలసిస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో-మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మెటీరియల్, ఇన్‌స్ట్రుమెం కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, థర్మోడైనమిక్స్, మైక్రోవూపాసెసర్ ఇంటర్‌ఫేసింగ్ వంటి అంశాలు ఉంటాయి.

బెస్ట్ కాలేజెస్
-ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీ వరంగల్, ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్ సహ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఉన్నత విద్య
-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసినవారు ఉన్నత విద్య అభ్యసించడానికి వివిధ అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంటెక్ లేదా ఎంఈ చేయాలంటే మొదట గేట్‌లో మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులకు 70 శాతం వెయి ఉంటుంది. దీంతోపాటు బీటెక్‌లో వచ్చిన మార్కులకు 30 శాతం వెయి ఇస్తారు. దీని ఆధారంగా దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఎంటెక్ లేదా ఎంఈ చేయవచ్చు. ఇందులో భాగంగా పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెసిన్స్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెం అప్లెడ్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. దీంతోపాటు గేట్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించినట్లయితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ఇచ్చే స్కాలర్‌షిప్‌ను కూడా పొందవచ్చు.

ఉద్యోగ అవకాశాలు..
-ఈ కోర్సు చేసినవారికి పవర్ కార్పొరేషన్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు, ఉత్పాదక సంస్థలు, హైడ్రో ఎలక్ట్రిసిటీ, డిజైనింగ్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో భాగంగా రిసెర్చ్, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, డెవలప్, మార్కెట్, టెస్టింగ్ ఎక్విప్‌మెంట్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసినవారికి బీహెచ్‌ఈఎల్, మెట్రోరైల్ కార్పొరేషన్లు, సామ్‌సంగ్, క్రామ్టన్ గ్రీవ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హితాచి, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎన్‌హెచ్‌పీసీ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

mechanical మెకానికల్ ఇంజినీరింగ్
-దేశ ఆర్థికాభివృద్ధిలో పారిక్షిశామిక రంగానిది ప్రధాన పాత్ర. ఇందులో యంత్రాల పాత్రే కీలకం. ముడిపదార్థాలను వస్తు రూపంలోకి తేవడానికి యంత్రాలు తోడ్పడుతాయి. అలాంటి యంత్రాల తయారీ నుంచి అవి పనిచేయడం వరకు మొత్తం మెకానికల్ ఇంజినీరింగ్ పరిధిలోకి వస్తాయి. ఇంజినీరింగ్‌లో ఈ బ్రాంచి చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక యంత్రాలు మెకానికల్ ఇంజినీర్లు రూపొందిస్తున్నవే. అయితే ఇతర బ్రాంచీలతో పోల్చితే మెకానికల్ వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువనే సందేహాలు ఉన్నాయి. ఇది అపోహ మాత్రమే. కష్టపడే తత్వం ఉంటే చాలు అవకాశాలు బోలెడు. మెకానిక్స్‌లో ఉత్తీర్ణతతో రోబోటిక్స్ నుంచి కూలింగ్ సిస్టమ్స్ వంటి తయారీ పరిక్షిశమల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పారిక్షిశామిక రంగానికి ఎలాంటి అడ్డంకులు లేనంత వరకు ఈ బ్రాంచి వారికి ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదు.

కోర్ సబ్జెక్టులు
-మెకానికల్ ఇంజినీరింగ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్ అండ్ డైనమిక్స్ కంట్రోల్, థర్మో డైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, మెకానిజమ్ అండ్ మెషిన్ డిజైన్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అంశాలను గురించి చదువుతాము.

మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలంటే..
-ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్‌తోపాటు జేఈఈ, బిట్‌శాట్ వంటి ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి.

మెకానికల్ కోర్సుకు బెస్ట్ కాలేజీలు
-ఈ కోర్సును ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్, బాంబే, కాన్పూర్, రూర్కీల్లోని ఐఐటీలు, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్-పిలానీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, నిట్-తిరుచురాపల్లి, సూరత్కల్, రూర్కెలా వంటి ఉన్నత విద్యాసంస్థలతోపాటు రాష్ట్రంలో జేఎన్‌టీయూ, ఓయూ, కేయూ పరిధిల్లోని ఇంజినీరింగ్ కలేజీలు అందిస్తున్నాయి.

ఉద్యోగ అవకాశాలు..
-బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఆటోమోటివ్, ఏరోస్పేస్, కెమికల్, కంప్యూటర్, కమ్యూనికేషన్, పేపర్, పవర్ జెనరేషన్ వంటి అన్ని తయారీ పరిక్షిశమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీవో, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, గెయిల్, ఎన్టీపీసీ, ఢిల్లీ మెట్రో రైల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అశోక్‌లేలాండ్, హోండా, మారుతి, టాటా మోటార్స్, మహింద్ర అండ్ మహింద్రా వంటి మోటార్ వెహికల్ తయారీ సంస్థలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహింద్ర వంటి టాప్ సాఫ్ట్‌వేర్ సంస్థలు మెకానికల్ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.

మెకానికల్ ఇంజినీరింగ్‌లో..
అండర్ గ్రాడ్యుయేట్
-బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ) మెకానికల్ ఇంజినీరింగ్
-బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్
-బీటెక్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్
-బీటెక్ మెకవూటానిక్స్

పోస్ట్ గ్రాడ్యుయేషన్
-బీటెక్ పూర్తిచేసిన తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్, టూల్ డిజైన్ స్పెషలైజేషన్స్‌తో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ), ఎంటెక్, పీహెచ్‌డీ చేయవచ్చు.

డిప్లొమా కోర్సులు
-డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ (మూడు/నాలుగేండ్ల కోర్సు). ఈ కోర్సు చేయాలంటే ఇంటర్మీడియెట్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-బీఈ, బీటెక్ పూర్తి చేసినవారు మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌క్షిగాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీ) చేయవచ్చు.


Information-Technology ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
-ఇంజినీరింగ్‌లో మీకు సరైన బ్రాంచి ఏదీ అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు మంచి కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయా... సోషల్ నెట్‌వర్కింగ్, డిజిటల్ కమ్యూనికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ వంటి సోషల్ టెక్నాలజీల్లో, బిజినెస్‌లో వచ్చే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మీ సొంతమా... అయితే మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) బ్రాంచ్ ఎంపికచేసుకోవచ్చు.
-మల్టీనేషనల్ కంపెనీల నుంచి చిన్న వ్యాపారాల వరకు, కమ్యూనికేషన్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, డాటా మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కస్టమర్ రిలేషన్‌షిప్స్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఐటీ పాత్ర కీలమైనది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, కొత్త కొత్త గేమ్స్, నూతన అప్లికేషన్లు, పరికరాలను ఐటీ ఇంజినీర్లు రూపొందిస్తున్నారు.

కోర్ సబ్జెక్టులు
-నాలుగేండ్ల ఐటీ కోర్సులో భాగంగా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్, డేటాబేస్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైన్, డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ ఆల్గారిదెమ్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఈ-కామర్స్ అండ్ ఈఆర్‌పీ, మల్టీమీడియా అప్లికేషన్స్ వంటి అంశాలను చదవాల్సి ఉంటుంది.

ఉన్నత విద్యావకాశాలు
-బీటెక్/బీఈ పూర్తిచేసిన తర్వాత వివిధ అంశాల్లో ఎంటెక్ లేదా ఎంఎస్ చేయవచ్చు. అయితే వీరిని గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు.
-వివిధ స్పెషలైజేషన్లతో చాలా కాలేజీలు ఎంటెక్ లేదా ఎంఎస్‌ను అందిస్తున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్ కోర్సులను అందిస్తున్నాయి.

ఉపాధి అవకాశాలు
-డేటాబేస్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్కింగ్, డిజైన్, డెవలప్‌మెంట్, రిసెర్చ్, డిజిటల్ హార్డ్‌వేర్, డిజిటల్ డివైజెస్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐటీ పూర్తిచేసిన వారిని గూగుల్, విప్రో, టీసీఎస్, యాక్సెంచర్, అడాబ్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్‌సీఎల్, టెక్‌మహింద్ర, కాగ్నిజెంట్ వంటి సంస్థలు నేరుగా క్యాంపస్ ఇంటర్వూల ద్వారా ఎంపిక చేసుకుంటున్నాయి.
-అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)లో సీటు రానివారికి ప్రత్యామ్నాయ కోర్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అని చెప్పవచ్చు.


woman-agriculture అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్
-దేశంలో జనాభా నానాటికి అధికమవుతున్నది. దానికి తగినట్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగడంలేదు. ఈ కొరతను తీర్చడానికి మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో ఆహార పదార్థాల ఉత్పత్తులను పెంచడం కోసం వ్యవసాయంలో నూతన వంగడాలను ప్రవేశపెట్టే విధంగా, కొత్త పద్ధతుల్లో సాగు ఉండేలా వివిధ పరిశోధనలపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. దీనికోసం వ్యవసాయ వర్సిటీలు, పరిశోధనా సంస్థలు కృషిచేస్తున్నాయి. అయితే దేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు తక్కువగా ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యలో వ్యవసాయ కోర్సులను ప్రవేశపెట్టారు. వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్ రంగాలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపచేయడం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ప్రధాన లక్షం. యానిమల్ బయాలజీ, ప్లాంట్ బయాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్ ప్రిన్సిపుల్స్‌తో ఈ కోర్సుకు సంబంధం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్‌కు డిమాండ్ పెరుగుతున్నది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల్లో లైఫ్ సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత పరిక్షిశమలు క్రమంగా విస్తరిస్తున్నాయి. జనాభా అవసరాలకు సరిపడా వ్యవసాయ ఉత్పత్తులు లేకపోడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పాదకతను పెంచడానికి అనేక దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనివల్ల మంచి శిక్షణ పొందిన అగ్రికల్చర్ ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
-అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్‌లో పంటలు వేయకముందు, దిగుబడి తర్వాత అవసరమైన టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ఇందులో చర్చిస్తారు. దీంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, యంత్రపరికరాలు, ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు, ఇన్‌స్ట్రుమెం వంటి అంశాలు ఉంటాయి. దీంతోపాటు కోర్సులో భాగంగా రిసెర్చ్, ఆహార పదార్థాల అభివృద్ధి ఎలా చేయాలి వంటి అంశాల్లో పరిజ్ఞానం సంపాదించవచ్చు.

కోర్సు చేయాలంటే
-కమ్యూనికేషన్ స్కిల్స్, అన్వయించుకోవడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలగడం వంటి వ్యక్తిగత సామర్థాలతోపాటు అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి.

కోర్ సబ్జెక్టులు
-ఈ కోర్సులో భాగంగా ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ వర్క్‌షాప్, క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ఫార్మ్ ఇంప్లిమెంట్స్ అండ్ మెషినరీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డెయిరీ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్, ఆక్వా కల్చరల్ ఇంజినీరింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫుడ్ ఇంజినీరింగ్, సాయిల్ టెక్నాలజీ, ప్లూయిడ్ మెకానిక్స్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ వర్క్‌షాప్ అంశాలు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు
-వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంతోపాటు, కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన వంగడాలను, అధిక దిగుబడినిచ్చే పంటలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ వర్సిటీలను, పరిశోధనా కేంద్రాలను కోరుతున్నాయి. దీంతోపాటు మనదేశంలో ఐఏఆర్‌ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంజినీరింగ్ తర్వాత ఇలాంటి సంస్థల్లో ఉన్నత కోర్సులు చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌కు అనుబంధంగా కోర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్) స్పెషలైజేషన్లు కూడా అధ్యయనం చేస్తే సంబంధిత విభాగాల్లో అవకాశాలు పొందవచ్చు.
-అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలు, వ్యవసాయ అభివృద్ధి నిర్వహణ సంస్థల్లో వ్యవసాయ అధికారులుగా, పర్యవేక్షణ అధికారులుగా అవకాశాలు లభిస్తాయి. వీటితోపాటు నెస్లే, ఐటీసీ లిమిటెడ్, క్యాడ్‌బరీ, బ్రిటానియా, అమూల్, నాథ్ రాయల్, అడ్వాంటా ఇండియా, ఆగ్రో టెక్ ఫుడ్స్ లిమిటెడ్, నామ్‌ధారీ సీడ్స్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ఉన్నత విద్య
-బీఈ లేదా బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఎంటెక్/ఎంఈ చేయవచ్చు. గేట్ స్కోర్ ఆధారంగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్‌లో వివిధ స్పెషలైజేషన్లతో ఎంటెక్ లేదా ఎంఈలో సీటు పొందవచ్చు. అదేవిధంగా పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత అభ్యర్థుల నైపుణ్యాలను బట్టి వివిధ సంస్థల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.

కోర్సును అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలు
-ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల-సంగాడ్డి (మెదక్), హోమ్‌సైన్స్ కాలేజీ-సైఫాబాద్ (హైదరాబాద్), గుంటూరులోని బాపట్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కాలేజీతోపాటు దేశంలోని వివిధ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

computer.science కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)
-దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది టెక్నాలజీ రంగం. బ్యాంకింగ్, ఎయిర్‌లైన్స్, ఇన్సూన్స్, రైల్వే, హాస్పిటల్స్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాలకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దీంతోపాటు అనేక పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆటోమొబైల్ రంగం నుంచి ఎయిరోస్పేస్ రంగాలకు సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేసే మైక్రోవూపాసెసర్ కంట్రోల్ అవసరం ఉంటుంది. ఇంట్నట్, అత్యాధునిక మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు షాపింగ్, టికెట్లు బుక్ చేసుకోవడం వంటి చిన్న చిన్న పనులను కూడా ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఈ సర్వీసులన్నింటిని అభివృద్ధి చేయడానికి, అవి ప్రతినిత్యం పనిచేసేలా చూడటానికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు (సీఎస్‌ఈ) కావాల్సిందే. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తున్నది. దీనికి తగినట్లుగా మౌలిక వసతులను సమకూర్చడంతోపాటు, అనేక ప్రోత్సాహకాలను కల్పిస్తున్నది. దీంతో గూగుల్, ఆపిల్ వంటి ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు రాజధాని నగరాన్ని తమ రెండో ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. అందువల్ల కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది.

కోర్ సబ్జెక్టులు
-కంప్యూటర్ అర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్, థియరీ ఆఫ్ కంప్యు డాటాబేస్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్‌వర్క్, ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్, ఈ-కామర్స్ & ఈఆర్‌పీ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రోగామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి అంశాలను సీఎస్‌ఈలో అధ్యయనం చేయవచ్చు.

బెస్ట్ కాలేజెస్
-హైదరాబాద్‌లోని ఐఐఐటీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఐఐటీ-ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్, బాంబే, కాన్పూర్, ఎన్‌ఐటీ-తిరుచురాపల్లి, సూరత్కల్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతోపాటు రాష్ట్రంలోని జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీల్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తిచేసినవారికి మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ రంగాల్లో..
-కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థులకు డాటాబేస్ మేనేజ్‌మెంట్, ఐటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెం మల్టీమీడియా, వెబ్ డిజైన్, గేమింగ్, వెబ్ అప్లికేషన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్ అప్లికేషన్స్, కంప్యూటర్ విజన్, సైంటిఫిక్ మోడలింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ, యానిమేషన్, వైర్‌లెస్ నెట్‌వర్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కోర్ కంపెనీస్, కంప్యూటర్ మాన్యుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
-కంప్యూటర్ పరిక్షిశమలో గత కొంతకాలంగా విస్తక్షుతమైన అభివృద్ధి చోటుచేసుకుంటుంది. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజాలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీటితోపాటు విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, టెక్‌మహింద్ర, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

ఉన్నత విద్య
-బీటెక్ లేదా బీఈ పూర్తయిన అనంతరం ఇంజినీరింగ్ సిస్టమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, మెకానికల్ హ్యాండ్లింగ్ అండ్ ఆటోమేషన్, మెకానికల్ సిస్టమ్స్ డిజైన్ అండ్ థర్మల్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ లేదా ఎంఎస్ చేయవచ్చు.
-దేశంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన సచిన్ బన్సల్, బిన్ని బన్సల్‌లు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లే. సో.. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేయడంతో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

-గణేష్


ఏటేటా ప్లేస్‌మెంట్స్ పెరుగుతున్నాయి
- ప్రొ. ఉమామహేశ్వర్,
క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఓయూ
ఇంజినీరింగ్ అడ్మిషన్లు త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? కొన్నేళ్లుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ప్యాకేజీలు, ఆయా బ్రాంచీలకు ఉన్న అవకాశాలపై యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (అటానమస్) ప్లేస్‌మెంట్ ఆఫీసర్ అసోసియేట్ ప్రొ. వి. ఉమామహేశ్వర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లో.....

umamaheshwar-ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచీ తీసుకొన్నా మంచి అవకాశాలు వస్తున్నాయి. మూడేండ్లుగా ప్లేస్‌మెంట్స్ పరిశీలిస్తే క్రమంగా పెరుగుతున్నాయి. ఓయూ క్యాంపస్ కాలేజీలో 2014లో 545, 2015లో 536, 2016లో 610 మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా వారి ప్యాకేజీలు కూడా సగటున రూ. 6.1 లక్షలు. ప్యాకేజీ సుమారు 30 శాతం పెరిగింది.
-సర్కూట్ బ్రాంచీలు (సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఐటీ)గా పిలిచే వీటికి ఐటీ/ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో అవకాశాలు వస్తున్నాయి. నాన్ సర్కూట్ బ్రాంచీలైన మెకానికల్, బయో మెడికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌లోని దాదాపు అన్ని బ్రాంచీలకు, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్థులకు ఈ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తున్నాయి.
-ఐటీ కోర్ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో సీఎస్‌ఈ/ఐటీ విద్యార్థులకు, బ్యాంకింగ్ కన్సప్టూన్సీ, ఇన్సూన్స్ కంపెనీలైన డెలాయిట్, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు సర్కూట్ బ్రాంచీ విద్యార్థులకు అవకాశాలు ఇస్తున్నాయి.
-కోర్ కంపెనీలు అంటే మెకానికల్ బ్రాంచీ విషయానికి వస్తే మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి, అశోకా, ఫియట్ ఇండియా వంటి వాటిల్లో ఏడాదికి రూ. 5 లక్షల వేతనంతో, సివిల్ విద్యార్థులకు ఎల్ అండ్ టీ, వేదాంత వంటి కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
-బయో మెడికల్, కెమికల్ తదితర బ్రాంచీలకు విదేశాల్లో మంచి భవిష్యత్ ఉంది. ఇంటిక్షిగేటెడ్ కోర్సులు చేసిన వారికి ప్రస్తుతానికి అంతగా అవకాశాలు లేవు.
-ఎంఈ/ఎంటెక్ లెవల్లో స్పెషలైజేషన్స్ చేసుకోవడం మంచిది.
-ఇంజినీరింగ్‌లో జాయిన్ కావాలనుకొనే విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీటు రాలేదని బాధపడొద్దు. మంచి ఫ్యాకల్టీ, ల్యాబ్స్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలి.
-మొదటి ఏడాది సాఫ్ట్‌స్కిల్స్, సీ, సీ+ ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యతను పెంచుకోవాలి. రెండో ఏడాదిలో ఒక విదేశీ భాషను నేర్చుకొంటే మంచిది. ఇక మూడో ఏడాది నుంచి గేట్, ఐఈఎస్ వంటి పరీక్షలకు ప్రిపేర్ కావాలి. వీటి వల్ల ఇంజినీరింగ్ పూర్తయ్యేలోగా మంచి ప్యాకేజీతో జీవితంలో స్థిరపడవచ్చు. - కేవీ శర్మ

0 comments:

Post a Comment