Friday, 10 June 2016

BCCL Recruitment 2016. 721 Vacancies Bharat Coking Coal Limited Recruitment 2016 భారత్ కోకింగ్ కోల్‌లో 721 ఉద్యోగాలు

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో ఖాళీగా ఉన్న మైనింగ్ సిర్దార్, జూనియర్ ఓవర్‌మెన్, ఓవర్‌సీర్ (సివిల్)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌ను 1972 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇది మినీరత్న హోదాను కలిగి ఉంది.
మొత్తం పోస్టులు: 721
పోస్టు పేరు: మైనింగ్ సిర్దార్ -345 పోస్టులు (జనరల్-62, ఓబీసీ-34, ఎస్సీ-64, ఎస్టీ-185)
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎమ్‌ఎస్) నుంచి మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత. గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
జూనియర్ ఓవర్‌మెన్-310 పోస్టులు (జనరల్-113, ఓబీసీ-29, ఎస్సీ-34, ఎస్టీ-134)
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎమ్‌ఎస్) నుంచి ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
ఓవర్ సీర్ (సివిల్) -66 పోస్టులు (జనరల్-35, ఓబీసీ-7, ఎస్సీ-7, ఎస్టీ-17)
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్షతోపాటు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 19,035 + ఇతర అలవెన్స్‌లను ఇస్తారు. (పై పోస్టులన్నింటికి)
వయసు : 2016 జూలై 7 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు: రూ.200/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక : రాతపరీక్ష ద్వారా
రాతపరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది
రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు.
రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ (పార్ట్ ఏ)-25 మార్కులు, ప్రొఫెషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్ బీ)-75 మార్కులు
పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజీలో ఉంటుంది
కేవలం ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు
రాత పరీక్ష తేదీని సంబంధిత అభ్యర్థికి రిజిస్టర్ పోస్ట్ లో సమాచారాన్ని పంపిస్తారు లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో పెడుతారు
పరీక్ష సెంటర్‌లు: ధన్‌బాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ WWW.BCCL.GOV ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పసరిగా ఎంటర్ చేయాలి. సంబంధిత అటెస్టెడ్ సర్టిఫికెట్లను జతపరిచి, దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా : THE ADVERTISER (BCCL),
POST BOX NO 9248,
KRISHNA NAGAR HEAD POST OFFICE,DELHI 110051
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 15
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : జూలై 7
అప్లికేషన్ ఫీజు చలానా చెల్లించడానికి చివరి తేదీ: జూలై 10
ఆన్‌లైన్ హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: జూలై 17
అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడింగ్ తేదీ: రాత పరీక్షకు 15 రోజుల ముందు
వెబ్‌సైట్: WWW.BCCL.GOV.IN

0 comments:

Post a Comment