Wednesday, 1 June 2016

Army Technical Entry ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ

కేవలం ఇంటర్‌లోఉత్తీర్ణత. చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన సౌకర్యాలు, ఇతర అలవెన్స్‌లు, కేవలం పదిహేడేండ్లలోపు ప్రాయంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కొలువు. దేశ రక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం. వీటన్నింటి సమాహారమే ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ పోస్టులు.
-ఇండియన్ ఆర్మీ (ఐఏ) పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ జనవరి 2017 కు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. నాలుగేండ్ల మిలటరీ ట్రెయినింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ హోదాలో తీసుకుంటారు
వివరాలు: భారతదేశాన్ని అనుక్షణం రక్షించే దళాల్లో ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షిండంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం
-పోస్టు పేరు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2 )
-మొత్తం ఖాళీల సంఖ్య: 90
-ఉద్యోగ స్థానం: ఇండియాలోని ఏ ప్రదేశంలోనైనా
అర్హతలు: సెంట్రల్ బోర్డ్/ స్టేట్ బోర్డ్ నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీలతో 70 శాతం మార్కులతో ఇంటర్ / 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
indian-army
-వయస్సు: 16 1/2 నుంచి 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి (1997 జూలై 1 నుంచి 2000 జూలై 2 మధ్య జన్మించి ఉండాలి)
-దేహదారుఢ్య ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తారు. అభ్యర్థులు కనీసం 152 సెం,మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
-పే అండ్ అలవెన్స్‌లు: ట్రయినింగ్ పీరియడ్‌లో రూ.21,000. శిక్షణ పూర్తయ్యాక వారు లెఫ్ట్‌నెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.15,600+గ్రేడ్ పే రూ. 5,400 తో సుమారుగా నెలకు రూ. 65,000 జీతం ఉంటుంది.
-ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా.
-సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) దరఖాస్తులను ్ట షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ఇ మెయిల్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా అభ్యర్థులకు తేలియజేస్తారు.
-ఇంటర్వ్యూ జరుగే ప్రదేశం : సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదు రోజులపాటు భోపాల్, బెంగళూర్, అలహాబాద్‌లో 2016 ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహిస్తుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చివరి తేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: WWW.JOININDIANARMY.NIC.IN

0 comments:

Post a Comment