Tuesday, 7 June 2016

Ammunition depot 56 jobs అమ్యునిషన్ డిపోలో 56 ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న 16 అమ్యునిషన్ డిపోలో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టులైన ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్, మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు:
ఫైర్‌మెన్-7 పోస్టులు (జనరల్-4, ఎస్సీ-2, ఓబీసీ-1)
ట్రేడ్స్‌మెన్ మేట్-37 పోస్టులు (జనరల్-19, ఎస్సీ-9, ఓబీసీ-9)
మెటీరియల్ అసిస్టెంట్-12 పోస్టులు (జనరల్-6, ఎస్సీ-3, ఎస్టీ-1, ఓబీసీ-2)
వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీలకు 30 ఏండ్ల వరకు, ఓబీసీలకు 28 ఏండ్ల వరకు, పీహెచ్‌సీలకు 35 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. ఈ పోస్టులను ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫైర్‌మెన్‌కు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతోపాటు కనీసం 165 సెం.మీ. ఎత్తు, ఛాతీ - 81.5 సెం.మీ. -85 సెం.మీ., బరువు కనీసం 50 కేజీలు ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/- (ఫైర్‌మెన్‌కు గ్రేడ్ పే రూ.1900/-)
మెటీరియల్ అసిస్టెంట్: రూ. 5200-20200+గ్రేడ్ పే రూ. 2,800/-
ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ద్వారా.
రాతపరీక్ష 150 మార్కులకు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25 మార్కులు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ -25 మార్కు లు, జనరల్ ఇంగ్లిష్-50 మార్కులు, జనరల్ అవేర్‌నేస్-50 మార్కులు వస్తాయి.
రాతపరీక్ష కేవలం ఇంగ్లిష్/హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి. పూర్తి వివరాల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.
చిరునామా: THE COMMANDANT
16 FIELD AMMUNITION DEPOT PIN 909716
C/O 99 APO

0 comments:

Post a Comment