Saturday, 11 June 2016

Air Force Common Admission Test - 2016 ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ - 2016

డిగ్రీ/ ఇంజినీరింగ్‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
-ఆకర్షణీయమైన జీతభత్యాలు, భరోసా కలిగిన జీవితం
-ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీల్లో ఖాళీలు
-పురుషులు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

భారత వాయుసేన కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) - 2/2016 నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్స్
ఈ పోస్టులకు మహిళలు, పురుషులు అర్హులు.
ఈ కోర్సు జూలై 2017లో ప్రారంభమవుతుంది.
ఫ్లయింగ్ బ్రాంచీ: 2017, జూలై 1 నాటికి 20 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. 1993, జూలై 2 నుంచి 1997, జూలై 2 మధ్య ఉండాలి. డీజీసీఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారు అయితే 1991, జూలై 2 నుంచి 1997, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ (మూడేండ్ల ఫుల్‌టైం) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సుతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.
శారీరక ప్రమాణాలు: ఎత్తు -162.5 సెం.మీ., కాళ్ల పొడవు - 99 సెం.మీ. గరిష్ఠంగా 120 సెం.మీ. ఉండాలి.
టెక్నికల్ బ్రాంచీ:
వయస్సు: 2017, జూలై 1 నాటికి 20 -26 ఏండ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు: ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) బ్రాంచీ కోసం ఇంటర్ ఫిజిక్స్, మ్యాథ్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కనీసం 60 శాతం మార్కులతో నాలుగేండ్ల ఇంజినీరింగ్/టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సు కింది విభాగాల్లో పూర్తిచేసిన వారు అర్హులు.
విభాగాలు: కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ అప్లికేషన్, సీఎస్‌ఈ/టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఈఈఈ, ఈసీఈ లేదా తత్సమాన బ్రాంచీలు.
ఏరోనాటికల్ ఇంజినీర్ (మెకానికల్) బ్రాంచీ కోసం కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్ ఉత్తీర్ణత. నాలుగేండ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్‌క్లాస్ మార్కులతో కింది విభాగాలు ఉత్తీర్ణులైన వారు.
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, ఏర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, మెకానికల్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమేషన్, మెకానికల్ (ప్రొడక్షన్) ఇంజినీరింగ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన బ్రాంచీ.
శారీరక ప్రమాణాలు: 157.5 సెం.మీ., మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉంటే సరిపోతుంది. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్:
వయస్సు: 2017, జూలై 1 నాటికి 20 -26 ఏండ్ల మధ్య ఉండాలి.
అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ - కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
అకౌంట్స్ - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత.
ఎడ్యుకేషన్ - కనీసం 50 శాతం మార్కులతో ఎంబీఏ/ఎంసీఏ లేదా ఎంఏ లేదా ఎమ్మెస్సీల్లో ఇంగ్లిష్/ఫిజిక్స్ లేదా మ్యాథ్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ స్టడీస్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్/ఐటీ,
మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు, మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
నోట్: 2017, జూలైలోగా అర్హత పరీక్షల ఫలితాలు వచ్చే వారు/ ఫైనల్ ఇయర్ డిగ్రీ/ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
2016, ఆగస్టు 28న నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అండ్ ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) (ఇది టెక్నికల్ బ్రాంచీ వారికి మాత్రమే) రాయాలి.
ఏఎఫ్‌సీఏటీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డులు డెహ్రాడూన్, మైసూర్, గాంధీనగర్, వారణాసి, కాంచీపురంల్లో కింది పరీక్షలను నిర్వహిస్తారు.
స్టేజ్ - 1: ఇంటెలిజెన్స్ టెస్ట్‌తోపాటు మరికొన్ని ఇతర టెస్ట్‌లను నిర్వహిస్తారు. వీటిల్లో క్వాలిఫై అయితే స్టేజ్ -2కు అనుమతిస్తారు.
స్టేజ్ - 2: సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇవి సుమారు 5 రోజులు పాటు ఉంటాయి.
ఫ్లయింగ్ బ్రాంచీ: కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్, పీఏబీటీలను నిర్వహిస్తారు.
శిక్షణ: జూలై 2017 నుంచి ప్రారంభమవుతుంది.
ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచీలకు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీలకు 52 వారాల శిక్షణ ఉంటుంది.
జీతభత్యాలు: ఫ్లయింగ్ బ్రాంచీ - రూ. 82,500/-
టెక్నికల్ బ్రాంచీ - రూ. 71, 500/-
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీ - రూ. 68, 550/-
వీటితోపాటు ఇతర సౌకర్యాలు.. వసతి, వైద్యం, ఎల్‌టీసీ, రేషన్, క్యాంటీన్ తదితరాలు ఉంటాయి.
ఏఎఫ్‌సీటీ పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, బీదర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై తదితర పట్టణాల్లో ఉన్నాయి. (మనకు దగ్గర్లోని పట్టణాలను మాత్రమే పేర్కొన్నాం)

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో(WWW.CAREERAIRFORCE.NIC.IN)
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: WWW.CAREERAIRFORCE.NIC.IN

0 comments:

Post a Comment