Sunday, 5 June 2016

Agricultural Net 2016 notification ,Agricultural University Lecturer / Assistant Professor Posts అగ్రికల్చరల్ నెట్ -2016 అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్

అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఈ పరీక్ష తప్పనిసరి
-56 విభాగాల్లో ఈ పరీక్ష జరుగుతుంది
-ఆన్‌లైన్ బేస్డ్ ఎగ్జామ్
-21 ఏండ్లు నిండిన వారు రాసుకోవచ్చు, గరిష్ఠ వయోపరిమితి లేదు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిధిలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) నెట్ 2016 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివారలు: అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) నెట్ (1) - 2016ను నిర్వహిస్తుంది.
దేశవ్యాప్తంగా 23 సెంటర్లలో నెట్‌ను నిర్వహించనున్నారు.

నెట్ పరీక్ష ఎందుకు...?
నెషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇది క్వాలిఫయింగ్ పరీక్ష. నెట్‌లో క్వాలిఫై అయినవారు రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, ఇతర అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి అర్హులు.
వయస్సు: 2016, ఆగస్టు 1 నాటికి 21 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష కేంద్రాలు: ఆనంద్, బెంగళూరు, షిల్లాంగ్, బరియేలీ, బార్‌క్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, కొచ్చిన్, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, జమ్ము, జోధ్‌పూర్, కర్నాల్, లక్నో, లూథియానా, ముంబై, పోర్ట్‌బ్లెయిర్, షిమ్లా, శ్రీనగర్
పరీక్ష నిర్వహించే విభాగాలు:
అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్ బాటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫ్రూట్‌సైన్స్, స్పైసెస్, ప్లాంటేషన్ అండ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్, వెజిటబుల్ సైన్స్, యానిమల్ బయోకెమిస్ట్రీ, యానిమల్ బయోటెక్నాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, యానిమల్ ఫిజియాలజీ, యానిమల్ రిప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ టెక్నాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసిటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ సర్జరీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిష్ న్యూట్రిషన్, ఫిష్ హెల్త్, ఫిష్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, అగ్రికల్చరల్ కెమికల్స్, అగ్రికల్చరల్ మెటరాలజీ, ఆగ్రోఫారెస్ట్రీ, ఆగ్రోనమీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సాయిల్ సైన్సెస్, అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్‌ఫార్మాటిక్స్, హోం సైన్స్, ఫార్మ్, మిషనరీ అండ్ పవర్, అగ్రికల్చరల్ స్ట్రక్చర్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, లాండ్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్‌టెక్నాలజీ, వెటర్నరీ అనాటమీ. మొత్తం 56 విభాగాలు ఉన్నాయి.
అర్హతలు: వేర్వేరు విభాగాలకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
పరీక్ష విధానం: పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఎంచుకొన్న విభాగం నుంచి ఇస్తారు.
పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
Agriculture

క్వాలిఫయింగ్ మార్కులు: జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఓబీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులను కోత విధిస్తారు.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన వారు అయితే 2016, ఆగస్టు 1 నాటికి పీజీ పూర్తిచేస్తే ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

ఎన్నిసార్లు ఈ పరీక్ష రాయవచ్చు...?
నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)ను ఐదుసార్లు మాత్రమే రాయవచ్చు.
ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన వర్తించదు.
అప్లికేషన్ ఫీజు: జనరల్ - రూ. 1000/-, ఓబీసీలకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ. 250/-
ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: WWW.ASRB.ORG.IN

0 comments:

Post a Comment