Friday, 27 May 2016

TS Genco 42 Chemist posts Recruitment Notification టీఎస్ జెన్‌కోలో 42 కెమిస్ట్ పోస్టులు

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాణ్యత, విద్యుత్ సరఫరా పవర్ జనరేటింగ్ స్టేషన్స్, కొత్త పవర్ ప్రాజెక్ట్స్ విస్తరణ దృష్ట్యా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 42 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు: టీఎస్ జెన్‌కో సంస్థ కంపెనీల చట్టం 2013 కింద 2014 మే 19న విలీనం చేయబడింది. 2014 జూన్ 2 నుంచి తన కార్యాకలాపాలను ప్రారంభించింది.
పోస్టు పేరు : కెమిస్ట్
మొత్తం పోస్టుల సంఖ్య : 42
జోన్ 1 పరిధి జిల్లాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
మొత్తం పోస్టులు: 40 (జనరల్-19, బీసీ ఏ-4, బీసీ బీ-3, బీసీ డీ-2, బీసీ ఇ-2, ఎస్సీ-5, ఎస్టీ-3, పీహెచ్-2)
జోన్ 2 పరిధి జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, నిజమాబాద్, మెదక్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ
మొత్తం పోస్టులు: 2 (జనరల్-1, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమశ్రేణిలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, కెమిస్ట్రీలు సబెక్ట్‌గా చదివి ఉండాలి.
వయస్సు: 2015 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏండ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 41,155-1700-44,555-1985-54,480-22,80-63,600
ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
ఎంపిక : రాత పరీక్ష
రాత పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 80 ప్రశ్నలు సంబంధిత కోర్ సబెక్ట్ నుంచి, మిగతా 20 ప్రశ్నలు జనరల్ అవేర్‌నేస్ అండ్ న్యూమరికల్ ఎబీలిటీస్ నుంచి వస్తాయి రాతపరీక్ష వ్యవధి 120 నిమిషాలు
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రమే
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : మే 30
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: జూన్ 25 (మధ్యాహ్నం 1 గంటవరకు)
పరీక్ష తేదీ : జూలై 10
వెబ్‌సైట్ : HTTP://TSGENCO.CGG.GOV.IN

0 comments:

Post a Comment