Sunday, 29 May 2016

Training + employ = ICICI po jobs Notification శిక్షణ + కొలువు = ఐసీఐసీఐ పీవో జాబ్స్

12 నెలల శిక్షణ, ఇంటర్న్‌షిప్ ..
-ఫీజు మొత్తం లోన్‌గా ...
-అనంతరం ఐసీఐసీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం...


ఐసీఐసీఐలో పీవో ఉద్యోగాలు
డిగ్రీ పూర్తయి, జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి, బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకొనేవారికి, చాలెంజింగ్ కెరీర్‌ను ఎన్నుకోవాలనుకొనేవారికి ఇదొక మంచి అవకాశం. శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చే నోటిఫికేషన్ వివరాలు మీకోసం ప్రత్యేకం....
ఐసీఐసీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.
2008 నుంచి సుమారు 14వేలకు పైగా అభ్యర్థులను ఐసీఐసీఐ మణిపాల్ అకాడమీ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్లుగా తీర్చిదిద్దారు.
ఏడాది పాటు నిర్వహించే క్లాస్‌రూం సెషన్స్, ఈ లెర్నింగ్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఆఫీసుల్లో నిర్వహించే ఇంటర్న్‌షిప్ ద్వారా శిక్షణను ఇస్తారు.
ట్రెయినింగ్‌లో కోర్‌బ్యాంకింగ్‌పై పరిజ్ఞానాన్ని, స్కిల్స్‌ను కల్పిస్తారు. ప్రధానంగా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్, చానెల్స్ అండ్ కస్టమర్స్, రిసిప్ట్, పేమెంట్స్ తదితరాలపై శిక్షణ ఉంటుంది.
అదేవిధంగా కింది స్పెషలైజేషన్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అవి..
1. ట్రేడ్ ఫైనాన్స్ 2. ప్రివిలేజ్ బ్యాంకింగ్
3. రూరల్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ 4. రిటైల్ బ్యాంకింగ్
5. ఐసీఐసీఐ నిర్ణయించిన ఇతర ప్రొఫైల్స్
శిక్షణ కాలంలో స్టయిఫండ్‌ను ఇస్తారు.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఐసీఐసీఐలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.
ICICIBank

ఎంపిక విధానం
ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జూలైలో ఉండవచ్చు), ఆన్‌లైన్ సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, కేస్‌బేస్డ్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ (సెప్టెంబర్, డిసెంబర్‌లో ఉంటాయి) వీటన్నింటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేసి అభ్యర్థులను ఎంపిక చేస్తార

ఫీజులు
కోర్సు ఫీజు, సర్వీస్‌ట్యాక్స్ అన్ని కలుపుకొని రూ. 3,77,029/-చెల్లించాలి.
ఫీజు మొత్తాన్ని ఐసీఐసీఐ లోన్ రూపంలో అందిస్తుంది.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిప్యూటీ మేనేజర్ ర్యాంక్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పోస్టు ఇస్తారు. వీరికి గ్రాస్ సాలరీ సుమారుగా ఏడాదికి రూ. 4 లక్షలకు పైగాఉంటుంది. బ్యాంక్‌లో జాయిన్ అయిన తర్వాత లోన్ ఈఎంఐలు ప్రారంభమవుతాయి. 60 నెలల కాలంలో లోన్ తీర్చే అవకాశం కల్పిస్తారు.

అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
జూన్ 30 నాటికి 25 ఏండ్లు మించరాదు. 1991, జూన్ 30 తర్వాత జన్మించిన వారై ఉండాలి.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే సెలక్షన్ ప్రాసెస్‌కు అనుమతిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ -2016, ఫిబ్రవరి 2017 బ్యాచ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: WWW.ICICICAREERS.COM

0 comments:

Post a Comment