Friday, 27 May 2016

NIMS Professors Jobs Notification Nims bibinagar నిమ్స్‌లో ప్రొఫెసర్స్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
పోస్టు పేరు: ప్రొఫెసర్
విభాగాలు: పాథాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, రేడియేషన్ అంకాలజీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో పద్నాలుగేండ్ల అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 37,400-67,000 + గ్రేడ్ పే రూ. 10,500 + ఇతర అలవెన్స్‌లు
పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు: క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరఫిటిక్స్, వెస్కులర్ సర్జరీ, ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్ అండ్ ఇమ్యూనో హెమాటాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో ఆరేండ్ల్ల అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 37,400-67,000 + గ్రేడ్ పే రూ. 9,000 + ఇతర అలవెన్స్‌లు
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: యూరాలజీ, కార్డియాలజీ, వెస్కులర్ సర్జరీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డీఎమ్, ఎంసీహెచ్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 15,600-39,100 + గ్రేడ్ పే రూ. 8,000 + ఇతర అలవెన్స్‌లు
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్స్
విభాగాలు: ఒబ్‌స్టిట్రిక్స్ అండ్ గైనకాలజీ, బీబీనగర్, యూనివర్సిటీ క్యాంపస్
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
పే స్కేల్: రూ. 18,750 + గ్రేడ్ పే రూ. 6,600 + ఇతర అలవెన్స్‌లు
అప్లికేషన్ ఫీజు: రూ.500/-
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిమ్స్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబందిత కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ రిక్రూట్‌మెంట్ అధికారికి పంపాలి.
చిరునామా: EXECUTIVE REGISTRAR, NIZAMS INSTITUTE OF MEDICAL SCIENCES,
PUNJAGUTTA, HYDERABAD,TELANGANA STATE, INDIA-500082.
చివరితేదీ: మే 28
వెబ్‌సైట్: WWW.NIMS.EDU.IN

0 comments:

Post a Comment