Friday, 27 May 2016

Jipmer 112 Posts Recruitment జిప్‌మర్‌లో 112 ఉద్యోగాలు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: జిప్‌మర్ భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
ప్రొఫెసర్-10 పోస్టులు
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 2,00,000/-
విభాగాలు: కమ్యూనిటీ మెడిసిన్, ఒబ్‌స్టిట్రిక్స్ అండ్ గైనకాలజీ, పాథాలజీ, సర్జరీ, అనాటమీ, మెడిసిన్, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో 14 ఏండ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్-19 పోస్టులు,
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ.1,20,000/-
విభాగాలు: మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పాథాలజీ, పిడియాట్రిక్స్, ఒబ్‌స్టిట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనెస్థీషియాలజీ , సర్జరీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ రెసిడెంట్-12 పోస్టులు
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 60,000/-
విభాగాలు: మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పిడియాట్రిక్స్, ఒబ్‌స్టిట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనెస్థీషియాలజీ
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ,ఎంఎస్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ రెసిడెంట్-12 పోస్టులు
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 60,000/-
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ
అర్హత: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేసిఉండాలి
టెక్నికల్ అసిస్టెంట్-9 పోస్టులుకన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 30,000/-
అర్హత: బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి
వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి
ల్యాబ్ టెక్నీషియన్-11 పోస్టులు
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 25,000/-
అర్హత: బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్)లో ఉత్తీర్ణత. మెడికల్ ల్యాబొరేటరీ రంగంలో ఏడాది అనుభవం ఉండాలి
వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
స్టెనోగ్రాఫర్-8 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 22,000/-
అర్హత: మెట్రిక్యులేషన్‌లో ఉతీర్ణత. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
స్టోర్ కీపర్-8 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 30,000/-
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. స్టోర్ కీపింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
మ్యూజియం క్యూరేటర్-1 పోస్టు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 25,000/-
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ (బాటనీ, జూవాలజీ, హ్యూమన్ బయాలజీలో ఉత్తీర్ణత. 28 ఏండ్లకు మించరాదు.
ప్రాజెక్టనిస్ట్-1 పోస్టు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 25,000/-
అర్హత: మెట్రిక్యులేషన్‌లో ఉతీర్ణత. ప్రాజెక్టనిస్ట్‌లో సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
మెడికల్ సోషల్ వర్కర్- 2 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 30,000/-
అర్హత: మాస్టర్ డిగ్రీ (సోషియాలజీ/సోషల్ వర్క్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్)తోపాటు రెండేండ్ల డిప్లొమా (సోషల్ వర్క్)లోఉత్తీర్ణత. సోషల్ వర్క్ లో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
పబ్లిక్ హెల్త్ నర్స్-2 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 40,000/-
అర్హత: మెట్రిక్యులేషన్‌లో ఉతీర్ణత. డిప్లొమా ఇన్ హెల్త్ నర్సింగ్‌లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బీఎస్సీ (నర్సింగ్ డిగ్రీ)లో ఉత్తీర్ణత.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
ఫార్మసిస్ట్-3 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 40,000/-
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉత్తీర్ణత, 25 ఏండ్లకు మించరాదు.
స్టాఫ్ నర్స్-2 పోస్టులు కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 30,000/-
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో ఉత్తీర్ణత.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
లోయర్ డివిజన్ క్లర్క్-4 పోస్టులు
కన్సాలిడేటెడ్ పే స్కేల్: రూ. 40,000/-
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30/25 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
వయస్సు: 18-27 మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (కొన్ని నాన్ టీచింగ్ పోస్టులకు అభ్యర్థులు-రూ.300/-)
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 21
వెబ్‌సైట్: WWW.JIPMER.EDU.IN 

0 comments:

Post a Comment