Sunday, 22 May 2016

Indian Ordnance Factory lower Division Clerk posts Recruitment ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోయర్ డివిజన క్లర్క్ పోస్టుల

మహారాష్ట్రలోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్‌కు చెందిన చాందాలో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్
మొత్తం ఖాళీల సంఖ్య: 14
అర్హతలు: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/30 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్‌పై టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్-50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -50, జనరల్ ఇంగ్లిష్-50, జనరల్ అవేర్‌నెస్-50 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
రాత పరీక్ష అనేది కేవలం ఇంగ్లిష్/హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: THE SR. GENERAL MANAGER, ORDNANCE FACTORY CHANDA, POST OFFICE:CHANDAPUR ORDNANCE FACTORY DISTRICT - CHANDRAPUR, STATE - MAHARASHTRA, INDIA PIN - 442501
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు మే 21-27 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు

0 comments:

Post a Comment