Friday, 27 May 2016

BSF 561 Trade constable posts Notification బీఎస్‌ఎఫ్‌లో 561 ట్రేడ్ కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర బలగాల్లో కొలువులు
-పురుషులకు మాత్రమే అవకాశం
-పదోతరగతి/ఐటీఐ ట్రేడ్ ఉత్తీర్ణత
- ఆకర్షణీయమైన జీతభత్యాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లోని కమ్యూనికేషన్ అండ్ ఐటీ డైరెక్టరేట్ కమ్యూనికేషన్ విభాగంలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ట్రేడ్ కానిస్టేబుల్, పోస్టుల భర్తీకి వివిధ జోన్‌లలో నివసిస్తున్న అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ ఐదు సాయుధ పోలీస్ దళాలల్లో ఒకటి. దీనిని డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు
పోస్టు పేరు: ట్రేడ్ కానిస్టేబుల్
మొత్తం ఖాళీల సంఖ్య - 561
విభాగాల వారీగా ఖాళీలు:
కానిస్టేబుల్ (కాబ్లర్)-67 పోస్టులు
కానిస్టేబుల్ (టైలర్)-28 పోస్టులు
కానిస్టేబుల్ (కార్పెంటర్)-2 పోస్టులు
కానిస్టేబుల్ (డ్రాఫ్ట్స్‌మెన్)-1 పోస్టు
కానిస్టేబుల్ (పెయింటర్)-5 పోస్టులు
కానిస్టేబుల్ (కుక్)-140 పోస్టులు
కానిస్టేబుల్ (వాటర్ క్యారియర్)-49 పోస్టులు
కానిస్టేబుల్ (వాషర్‌మెన్)-49 పోస్టులు
కానిస్టేబుల్ (బార్బర్)-42 పోస్టులు
కానిస్టేబుల్ (స్వీపర్)-147 పోస్టులు
కానిస్టేబుల్ (వెయిటర్)-24 పోస్టులు
కానిస్టేబుల్ (మాలీ)-1 పోస్టు
కానిస్టేబుల్ (కోజీ)-6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌తోపాటు రెండేండ్లపాటు సంబంధిత ట్రేడ్ రంగంలోఅనుభవం ఉండాలి లేదా ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల డిప్లొమా కోర్స్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 2016, ఆగస్టు 1 నాటికి 18 - 23 ఏండ్ల మధ్య ఉండాలి . ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/-ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలు ఉంటాయి.
శారీరక ప్రమాణాలు:
ఎత్తు: 167.5 సెం.మీ., ఛాతీ: 83 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (78 సెం.మీ.-83 సెం.మీ.)
ఎస్టీ అభ్యర్థులకు 162.5 సెం.మీ., ఛాతీ: 81 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (76 సెం.మీ.-81 సెం.మీ.)
బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
కంటిచూపు: 6/6, 6/9 కంటి చూపు ఉండాలి. రేచీకటి, కలర్ ైబ్లెండ్‌నెస్ ఉండ-కూడదు.
అప్లికేషన్ ఫీజ్: రూ. 50/-(ఎస్సీ, ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా.
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది
మొదటి దశ-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్
రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులుకుగాను 2 గంటల సమయాన్ని కేటాయించారు
ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్‌లో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లిష్/హిందీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్ సబెక్ట్‌ల నుంచి ప్రశ్నలను ఇస్తారు
ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది
ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది
ఈ పరీక్షలో జనరల్ 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం కనీసం మార్కులను సాధించాలి.
రెండో దశ-పీఎస్‌టీ/పీఈటీ, ట్రేడ్ టెస్ట్, ఫైనల్ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎత్తు, ఛాతీ, బరువులను కొలుస్తారు
పీఈటీలో భాగంగా అభ్యర్థులు 24 నిమిషాల్లో 5 కి.మీ.దూరాన్ని పూర్తిచేయాలి
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: జూన్ 20
వెబ్‌సైట్: HTTP://BSF.NIC.IN

0 comments:

Post a Comment