Sunday, 29 May 2016

BECIL Trainees Jobs బీఈసీఐఎల్‌లో ట్రెయినీలు

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రెయినీ, డిప్లొమా ట్రెయినీ చేయడానికి (అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: మినీరత్న కంపెనీ అయిన బీఈసీఐఎల్ అనేది 1995 మార్చి 24న స్థాపించబడింది. ఇది రేడియో, టెలివిజన్ ప్రసార ఇంజినీరింగ్, ఉపగ్రహ, కేబుల్ ప్రసారం, ప్రత్యేకమైన కమ్యూనికేషన్, పర్యవేక్షణ, రక్షణకు, పోలీసు శాఖ, వివిధ పారామిలిటరీ ఫోర్సెస్‌కు సహాయపడుతుంది.

గ్రాడ్యుయేట్ ట్రెయినీ- ఏడాదిపాటు ట్రెయినింగ్
అర్హత: గురింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత.
స్టయిఫండ్: రూ. 4984/-
డిప్లొమా ట్రెయినీ- ఏడాదిపాటు ట్రెయినింగ్
అర్హత: గురింపు పొందిన బోర్డు నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత.
స్టయిఫండ్: రూ. 3542/-
ఎంపిక: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ : జూన్ 20
వెబ్‌సైట్: WWW.BECIL.COM

0 comments:

Post a Comment