Sunday, 29 May 2016

Bank of India 517 jobs Notification బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 517 ఉద్యోగాలు

అర్హతలు: బీకాం + ఎంబీఏ
-రాతపరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
-చివరితేదీ: జూన్ 14

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లో 517 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: 1906, సెప్టెంబర్ 7న బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రముఖ వ్యాపారవేత్త ముంబైలో ప్రారంభించాడు. ఆ తర్వాత 1969లో బ్యాంకుల జాతీయీకరణ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా జాతీయం చేశారు.
ప్రస్తుతం 22 దేశాల్లో, 5 ఖండాల్లో ఈ బ్యాంక్ శాఖలు విస్తరించి ఉన్నాయి.
జాతీయ బ్యాంక్‌ల్లో పూర్తిగా కంప్యూటరైజ్డ్, ఏటీఎంలను ప్రారంభించిన బ్యాంక్‌గా రికార్డు నెలకొల్పింది.
పోస్టుల వివరాలు:

ఆఫీసర్ క్రెడిట్ (జేఎంజీఎస్ -1)
ఖాళీల సంఖ్య - 217. వీటిలో ఎస్సీ - 24, ఎస్టీ - 24, ఓబీసీ - 117.
పేస్కేల్: 23700 -980/7-30560-1145/2-32580-1310/7-42020
వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం బీకాంతోపాటు గుర్తింపు పొందిన/ పేరొందిన సంస్థ నుంచి ఎంబీఏ/పీజీడీఎం లేదా పీజీడీబీఏ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ, ఐసీడబ్ల్యూఏ చేసిన వారు అర్హులే.
మేనేజర్ (ఎంఎంజీఎస్ - 2)
పేస్కేల్: 31,705 - 1145/1-32850-1310/10-45950
వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 28 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల ఫుల్‌టైం బీకాం డిగ్రీతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీబీఏ ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ/ఐసీడబ్ల్యూఏ చేసిన వారు కూడా అర్హులే.
అనుభవం: కనీసం 5 ఏండ్ల అనుభవం ఉండాలి.
businessrelation

సీనియర్ మేనేజర్ (ఎంఎంజీఎస్ -3):
ఖాళీల సంఖ్య - 100. వీటిలో ఎస్సీ - 15, ఎస్టీ - 7, ఓబీసీ - 27, జనరల్ - 51 ఉన్నాయి.
పేస్కేల్: 42020-1310/5-48570-1460/2-51490
వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 30 - 38 ఏండ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల ఫుల్‌టైం బీకాం డిగ్రీతో పాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీబీఏ లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వారు అర్హులు.
అనుభవం: కనీసం 7 ఏండ్ల అనుభవం ఉండాలి.
నోట్: పై పోస్టులన్నింటికి వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ ఎగ్జామ్:
ఇంగ్లిష్ - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ ఇండస్ట్రి) - 50, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ - 50 మార్కులు ఉంటాయి.
పరీక్ష కాలవ్యవధి - 150 నిమిషాలు.
అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. జనరల్ విద్యార్థులకు ప్రతి సెక్షన్‌లో 20 మార్కులు రావాలి.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, తిరువనంతపురం.
ఇంటర్వ్యూ: ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. దీనిలో జనరల్ అభ్యర్థులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు రావాలి.

సెక్యూరిటీ ఆఫీసర్స్
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 22 సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 208. వీటిలో ఎస్సీ -4, ఎస్టీ - 2, ఓబీసీ - 9, జనరల్ - 7 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 25 - 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ కోర్సులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్
ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 600/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 31 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 14
వెబ్‌సైట్: WWW.BANKOFINDIA.CO.IN
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 31 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 14
ఫీజు: జనరల్, ఇతరులకు రూ. 600/ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
వెబ్‌సైట్: WWW.BANKOFINDIA.CO.IN

0 comments:

Post a Comment