Monday, 11 April 2016

Indian Railways Groups Special RRb Notes ఇండియన్ రైల్వేస్

ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా గుర్తింపు పొందింది భారతీయ రైల్వే. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజారవాణా వ్యవస్థ. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా తానూ రూపాంతరం చెందుతూ సరికొత్త సేవలను అందిస్తూ... ఒకే యాజమాన్యంలోగల ప్రభుత్వరంగ సంస్థగా గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందింది. నాటి బ్రిటిష్ పాలకులు దేశంలోని సహజ సంపదను తరలించుకుపోవడానికి 1853, ఏప్రిల్ 16న తొలిసారిగా రైల్వే లైన్లను ప్రారంభించారు. అయితే తరువాతి రోజుల్లో ప్రజారవాణా వ్యవస్థగా మారి, ప్రత్యేకంగా బడ్జెట్‌ను రూపొందించుకునే స్థాయికి చేరింది. అలాంటి రైల్వేలు దేశంలో ప్రారంభమై ఏప్రిల్ 16తో 163 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రైల్వే వ్యవస్థకు సంబంధించిన విశేషాలు...

ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ట్రెమితిక్ 1808లో మొదటిసారిగా ఆవిరి రైల్ ఇంజిన్‌ను కనుగొన్నారు. ఇందులో ఉన్న లోపాలను సవరించి 1825లో జార్జ్ స్టీవెన్సన్ ఆధునిక రైల్ ఇంజిన్‌ను రూపొందించారు.
-భారతదేశంలో మొదటిసారిగా రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ 1832లో ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు అనుమతించారు.
-దీంతో దేశంలో తొలిసారిగా రైల్వే లైన్లను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసి 1853, ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు.
-ప్రపంచంలో మొదటిసారిగా 1825, సెప్టెంబర్ 27న బ్రిటన్‌లోని స్టాక్‌స్టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడిచింది.

-దేశంలో తొలి రైలు 1851, డిసెంబర్ 22న ఒరిస్సాలోని రూర్కీలో నిర్మాణ సామాగ్రితో పట్టాలపైకి ఎక్కింది.
-దేశంలో మొట్టమొదటి రైలు 1853, ఏప్రిల్ 16న బొంబాయి-థానేల మధ్య ఫెయిరీ క్వీన్ స్టీమ్ ఇంజిన్‌తో 34 కి.మీ. ప్రయాణించింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు నడిచింది.
-మొదటి ప్యాసింజర్ రైలు 1854, ఆగస్ట్ 15న హౌరా నుంచి హుగ్లీ వరకు 24 మైళ్లు నడిచింది.
-దక్షిణ భారతదేశంలో మొదటి రైలు 1856, జూలై 1న వేయన్ రాప్ది (మద్రాస్) నుంచి వల్లజా రోడ్ (ఆర్కాట్) వరకు ప్రయాణించింది.

line
-1908లో తొలి విద్యుత్ రైలు ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. దేశంలో మొదటిసారిగా బొంబాయి నుంచి కుర్లా వరకు 16 కి.మీ. దూరాన్ని 1925లో విద్యుదీకరించారు.
-1929లో మొదటి ఎలక్ట్రిక్ రైలు దక్కన్ క్వీన్ కల్యాణ్-పుణెల మధ్య నడిచింది.
-దేశంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థను 1984, అక్టోబర్ 24న కలకత్తాలో ఏర్పాటు చేశారు.
-మద్రాస్‌లో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట మధ్య రైల్వే లైన్ వేశారు.

-ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా, రష్యా, చైనా తరువాత భారతదేశం నాలుగో స్థానంలో ఉంది.
-ప్రపంచంలో ఒకే యాజమాన్యం కింద పనిచేస్తున్న అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
-ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న మన రైల్వే ఎనిమిదో స్థానంలో ఉంది. మొదటి ఏడు స్థానాల్లో అమెరికా సైన్యం, చైనా సైన్యం, చైనా రైల్వేలు, వాల్‌మార్ట్, చైనా నేషనల్ పెట్రోలియం సంస్థ, చైనా స్టేట్ గ్రిడ్, బ్రిటిష్ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి.
-స్వాతంత్య్రం పొందేనాటికి దేశంలో 42 వేర్వేరు రైల్వే వ్యవస్థలు ఉన్నాయి. 1951లో వీటన్నింటినీ జాతీయం చేసి భారతీయ రైల్వేను ఏర్పాటు చేశారు.

line1
-దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయి.
-అతిపెద్ద రైల్వే జోన్: ఉత్తర రైల్వే జోన్ (6,968 కి.మీ.)
-అతిచిన్న రైల్వే జోన్: ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్
-ప్రపంచంలో అత్యంత పొడవైన ప్లాట్‌ఫారంను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించారు. దీని పొడవు 1,366.33 మీ. (4,483 FT)
-దేశంలో మొదటి డబుల్ డెక్కర్ రైలు బొంబాయి సెంట్రల్ నుంచి సూరత్ వరకు నడిచింది.

-దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు: వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి అసోంలోని దిబ్రూఘడ్ వరకు ప్రయాణిస్తున్నది. ఇది 1.10 గంటల్లో 4,723 కి.మీ. ప్రయాణిస్తుంది.
-దేశంలో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్- ఆజ్నీ ప్యాసింజర్ (3 కి.మీ.)
-ఎక్కువ రాష్ర్టాల నుంచి ప్రయాణించే రైలు: నవయుగ ఎక్స్‌ప్రెస్. ఇది మంగుళూరు-జమ్ముతావిల మధ్య 13 రాష్ర్టాల గుండా ప్రయాణిస్తుంది.

-దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు: శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ-భోపాల్ మధ్య గంటకు 150 కి.మీ. వేగంతో నడుస్తుంది.
-ఎక్కడా ఆగకుండా (నాన్‌స్టాప్) ఎక్కువ దూరం నడిచే రైలు: త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది వడోదరా-కోటాల మధ్య 528 కి.మీ. (6.55 గంటలు) ఆగకుండా ప్రయాణిస్తుంది.
-ఎక్కువ స్టేషన్లలో ఆగే ఎక్స్‌ప్రెస్: హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్. ఇది మొత్తం 115 చోట్ల ఆగుతుంది.
-మొదటి మోనో రైలు: ముంబై మోనోరైలు. ఇది ముంబైలోని పడాల-చెంబూరు రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. దీనిని 2014, ఫిబ్రవరి 1న నాటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ప్రారంభించారు.
-దేశంలో అతిపెద్ద రోడ్డు రైల్ బ్రిడ్జి: రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉంది
-దేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన: బీహార్‌లోని ససారాం సమీపంలో సోన్ నదిపై ఉంది.

-దీని పొడవు 3.5 కి.మీ., దీనిని నెహ్రూ సేతు అని పిలుస్తారు.
-దేశంలో కాకుండా ఆసియాలో అతి పొడవైన రైలు సొరంగ మార్గం (టన్నెల్): కొంకణ్ రైల్వే మార్గం పరిధిలో ఉంది
-ఇది గోవాకు సమీపంలో ఉంది. దీనిని కర్బూడే టన్నెల్ అంటారు. దీని పొడవు సుమారు 6.5 కి.మీ.
-దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించిన రైలు మార్గం: కొంకణ్ రైలు మార్గం దీని పొడవు 700 కి.మీ. గోవా నుంచి మంగుళూరు వరకు వేశారు.
-కొంకణ్ రైలు మార్గంలోని పనవల్ నదిపై 64 మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన దేశంలో ఎత్తయినది.

-ప్రపంచంలో ఎత్తయిన రైలు వంతెనను చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు.
-దేశంలో మొదటి రైల్వే స్టేషన్: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై)
-భారతీయ రైల్వేలు 150 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2003లో బోలు... ద గార్డ్ అనే నినాదంతో సిగ్నల్ లైట్‌ను పట్టుకున్న ఒక ఏనుగు బొమ్మ మస్కట్‌ను విడుదల చేశారు.
-ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్న ప్రపంచంలోనే అతి పురాతన రైలు ఇంజన్ ఫెయిరీక్వీన్
-భారతీయ రైల్వేల నినాదం: జాతి జీవన రేఖ
-కొంకణ్ రైల్ ప్రాజెక్ట్: దేశంలో మొదటిసారిగా 1998, జనవరి 26న ప్రైవేట్ రంగంలో రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్రలోని రోహా నుంచి కర్ణాటకలోని మంగుళూరు వరకు ఉంది. దీని పొడవు 700 కి.మీ. ఈ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయం నవీ ముంబైలో ఉంది. కొంకణ్ రైల్వే జోన్ పరిధిలో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలు ఉన్నాయి.

రైల్వే గణాంకాలు
-ప్రతి రోజు ప్రయాణించే రైళ్లు: 19,000 (ప్యాసింజర్ రైళ్లు 12,000, గూడ్స్ రైళ్లు 7,000)
-రైళ్లు ప్రయాణించే దూరం: 13.4 లక్షల కి.మీ.
-ప్రతి రోజు రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య: 2.50 కోట్లు (ఈ ప్రయాణికులు ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ)
-దేశంలో రైల్వే స్టేషన్లు: 7,112
-దేశంలో ప్రతిరోజు చేరవేసే సరుకు: 290 మి.టన్నులు
-వార్షిక రాబడి: రూ. 1,63,450 కోట్లు
-మొత్తం రైల్వే వంతెనలు: 1,31,205

దేశ నలుమూలల చివరి రైల్వే స్టేషన్లు
-తూర్పున- తిన్‌సుకియాలోని లీడోలు.....
-పడమరన- గుజరాత్‌లోని భుజ్ సమీపంలో గల నలియా
-ఉత్తరాన- జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా
-దక్షిణాన- కన్యాకుమారి

అంతర్జాతీయ రైళ్లు-మార్గాలు
-పాకిస్థాన్: అమృత్‌సర్ నుంచి లాహోర్‌కు వెళ్లే రైలు సంఝౌతా ఎక్స్‌ప్రెస్
-మునబావో (రాజస్థాన్) నుంచి కాక్రసార (సింధ్‌రాష్ట్రం) థార్‌ఎక్స్‌ప్రెస్

ప్రత్యేక రైళ్లు
-సుశాంత్ ఎక్స్‌ప్రెస్: వాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా సుపరిపాలనా దినోత్సవం ప్రారంభించారు. సుశాంత్ ఎక్స్‌ప్రెస్‌ను 2014, డిసెంబర్ 25 నుంచి నడుపుతున్నారు.
-జీవన్ రేఖ: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య అవసరాల కోసం ప్రపంచంలో మొదటిసారిగా 1991 జూలై 16న ముంబైలో జీవన్‌రేఖ (లైఫ్‌లైన్) ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.
-ధన్వంతరి: రోగులకు ఔషధాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన రైలు
-ప్యాలస్ ఆన్ వీల్స్: పర్యాటక రంగం కోసం రాజస్థాన్ ఏర్పాటు చేసిన రైలు
-గోల్డెన్ చారియట్: కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం ఏర్పాటు చేశారు
-దక్కన్ ఒడిస్సి: మహారాష్ట్ర, గోవా పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం
-రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్: ఎయిడ్స్ రోగంపై అవగాహన, ప్రచారం, చికిత్స కోసం
-సైన్స్ ఎక్స్‌ప్రెస్: సైన్స్ సాంకేతిక రంగాలు, పర్యావరణం గురించి తెలపడం గురించి ఏర్పాటు చేశారు.

-గరీభ్ రథ్: పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరలకే 2010లో ప్రారంభించారు.
-దీన్ దయాళ్: రిజర్వేషన్ లేకుండా సుదూరంగా ప్రయాణించే రైళు
-మహాపరినిర్వాణ: బౌద్ధ క్షేత్రాల సందర్శన కోసం ఏర్పాటు
-హాస్పిటల్ ఆన్ వీల్స్: నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించే రైలు
-దురంతో ఎక్స్‌ప్రెస్: ఇది మెట్రో సిటీ- రాష్ట్ర రాజధానుల మధ్య ప్రయాణిస్తుంది. రాజధాని, శతాబ్ది రైళ్ల కన్నా వేగంగా నడుస్తుంది.

గేజ్
-రైల్వే పట్టాల మధ్య దూరాన్ని గేజ్ అంటారు. ఈ దూరాన్ని అనుసరించి నాలుగు రకాలుగా వర్గీకరించారు.
-బ్రాడ్ గేజ్- 1.676 మీ. వెడల్పు
-మీటర్ గేజ్- 1 మీ.
-న్యారో గేజ్- 0.762 మీ.
-లైట్ న్యారోగేజ్- 0.619 మీ.
-గతంలో ఎక్కువగా న్యారోగేజ్ రైల్ మార్గాలు ఉన్నాయి. అయితే ఆధునీకరణలో భాగంగా 98 శాతం రైల్వే లైన్లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చారు. కేవలం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి పర్వత ప్రాంతాల్లోనే న్యారో గేజ్ మార్గాలను ఉపయోగిస్తున్నారు.

రైల్వే శిక్షణా కేంద్రాలు
-రైల్వే స్టాఫ్ కాలేజ్- వడోదర
-రైల్వే టెస్టింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్- లక్నో
-ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ట్రాక్ టెక్నాలజీ- పుణె
-ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్- సికింద్రాబాద్

రైల్వే కర్మాగారాలు
-ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ: ఇక్కడ రైలు బోగీలు, ఏసీ కోచ్‌లు తయారవుతాయి. దీన్ని 1955లో తమిళనాడులోని పెరంబుదూర్‌లో ఏర్పాటు చేశారు.
-చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్: దీన్ని 1950లో పశ్చిమబెంగాల్‌లోని చిత్తరంజన్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ రైల్ ఎలక్ట్రో మోటివ్ ఇంజిన్‌లు తయారవుతాయి.
-వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్: ఇక్కడ రైలు చక్రాలు, ఇరుసులను రూపొందిస్తారు. దీన్ని 1964లో బెంగళూరు సమీపంలోని ఎలహంకలో ఏర్పాటుచేశారు.
-రైల్ కోచ్ ఫ్యాక్టరీ: రైలు పెట్టెలు, సెకండ్ క్లాస్ బోగీలు తయారవుతాయి. దీన్ని పంజాబ్‌లోని కపుర్తలలో 1988లో ఏర్పాటు చేశారు.

-డీజిల్ కాంపోనెట్ వర్క్: డీజిల్ యంత్ర విడిభాగాలు తయారవుతాయి. ఇది పంజాబ్‌లోని పాటియాలలో ఉంది.
-డీజిల్ లోకోమోటివ్ వర్క్స్: దీన్ని 1964లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ డీజిల్ యంత్రాలు తయారవుతాయి.
-పరిపాలనా సౌలభ్యం కోసం రైల్వేలను 17 జోన్లుగా విభజించారు.
-ప్రారంభంలో తొమ్మిది రైల్వే జోన్లు ఉండగా అనంతరం మరో ఎనిమిది జోన్లను ఏర్పాటు చేశారు.
-దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే.

-1966 అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశారు.
-దేశంలో పెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే, చిన్న రైల్వే జోన్ ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్
-అత్యధికంగా రైల్వే మార్గాలున్న రాష్ట్రం: ఉత్తరప్రదేశ్ (8,566 కి.మీ.)
-అత్యల్ప రైల్వే మార్గాలున్న రాష్ట్రం: మణిపూర్ (1 కి.మీ.)

తెలంగాణలో రైల్వేలు
-1873లో నిజాం స్టేట్ రైల్వే ఇంగ్లండ్‌లో ఏర్పాటైంది. ఇందులో నిజాం ప్రభుత్వ వాటా 5 లక్షల పౌండ్లు. నిజాం నిర్మించిన తొలి రైల్వే లైను వాడి-హైదరాబాద్. అప్పట్లో నిజాం స్టేట్ రైల్ ప్రధాన కార్యాలయం

కాచిగూడ రైల్వే స్టేషన్
-రైల్వే నిర్వహణను నిజాం ప్రభుత్వం 1930లో స్వీకరించింది. దీంతో హిజ్ హైనస్ ద నిజామ్స్ గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్ ఆవిర్భవించింది.
-భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం స్టేట్ రైల్వే సెంట్రల్ రైల్వేలో విలీనమయ్యింది. ఆ తరువాత 1966, అక్టోబర్ 2న ప్రారంభమైన దక్షిణమధ్య రైల్వేలో భాగమైంది.
-హైదరాబాద్-ఢిల్లీ మధ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 1976లో ప్రారంభమైంది.
-దక్షిణమధ్య రైల్వేలో తొలి కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ 1989, సెప్టెంబర్ 30న సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభమైంది.

రైల్వే బడ్జెట్
-ఆక్ వర్డ్ కమిటీ సూచనల ప్రకారం కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను 1921లో వేరు చేశారు.
-1924-25లో ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను మొదటిసారిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
-రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెడుతారు.
-రైల్వే బడ్జెట్‌ను తొలిసారిగా 1994, మార్చి 24న దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
-2004-2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ వరుసగా 6 సార్లు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
-రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రి మమతా బెనర్జీ
-రైల్వే ప్రమాదం జరగడంతో తన పదవికి రాజీనామా చేసిన మొదటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి
-లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖామంత్రిగా ఉన్న సమయంలో 1956లో మద్రాస్-ట్యుటికోరన్ ఎక్స్‌ప్రెస్ రైలు అరియాలూర్ నదిలో పడిపోయి 156 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహించి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.

-మొదటి రైల్వే మంత్రి జాన్ మతాయ్
-ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
-ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్
-సురేశ్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో (2016-17) మూడు కొత్త రకాల సూపర్ ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టారు.

line2
1. హమ్‌సఫర్ రైలు: ఇది పూర్తిగా థర్డ్ ఏసీ బోగీలతో కూడి ఉంటుంది. ఇందులో కోరినవారికి భోజనం అందిస్తారు.
2. తేజస్ రైలు: గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇందులో వినోదం, స్థానిక ఆహారం, వై-ఫై సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ రెండు రైళ్లకు కేవలం చార్జీల ద్వారానే నిర్వహణ వ్యయం మొత్తాన్ని రాబడతారు.
3. ఉదయ్: అత్యంత రద్దీగల మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లను, ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో కూడిన ఉత్కృష్ట్ రైళ్లను కూడా ప్రకటించారు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్

జాబితాలోని రైళ్ల మార్గాలు
-డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (జల్పాయి గురి నుంచి డార్జిలింగ్)- 1999
-ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై)- 2004
-నీలగిరి మౌంటేన్ రైల్వే (నీలగిరి కొండలు)- 2005
-కాల్క-సిమ్లా రైల్వే (హిమాచల్‌ప్రదేశ్‌లోని శివాలిక్ పర్వత శ్రేణులు)- 2008
-మాతరన్ రైల్వే (మహారాష్ట్ర)- 2014

0 comments:

Post a Comment