Thursday, 10 March 2016

Telangana Tet and Dsc Special notes టెట్, డీఎస్సీ ప్రత్యేకం

తెలుగు సాహిత్య ప్రక్రియలు
-పురాణం అంటే ప్రాచీనమైన అని అర్థం.
-పురాపినవమ్ పురాణమ్ పురానీయతే ఇతి పురాణమ్ పురాభవమితి పురాణమ్ మొదలైనవి నిర్వచనాలు.
-పురాణం పంచలక్షణమని చెప్పినవాడు- అమరసింహుడు.
telugu-lipi-పురాణం పంచలక్షణాలు - 1) సర్గ 2) ప్రతిసర్గ 3) వంశం 4) వంశానుచరితం 5) మన్వంతరం.
-సర్గ అంటే సృష్టిపుట్టుపూర్వోత్తరాలను తెలిపేది.
-ప్రతిసర్గ అంటే కల్పాంతంలో జరిగే పునఃసృష్టి.
-వంశం అంటే దేవతలు, రాక్షసులు, రుషుల వంశ వృత్తాంతాన్ని వివరించేది.
-సూర్యచంద్ర వంశాలకు చెందిన రాజుల వృత్తాంతాన్ని తెలిపేది- వంశానుచరితం.
-మన్వంతరం అంటే 14 మంది మనువులు.
1) స్వాయంభువ 2) స్వారోచిష 3) ఉత్తమ 4) తామస 5) రైవత 6) చాక్షుష 7) వైవస్వత 8) సూర్వసావర్ణికం 9) దక్షసావర్ణిక 10) బ్రహ్మసావర్ణిక 11) రుద్రసావర్ణిక 12) ధర్మసావర్ణిక 13) రౌచ్య 14) బౌచ్యమనువులు
-పురాణాల సంఖ్య 18. వీటిని అష్టాదశ పురాణాలని అంటారు.
-అష్టాదశ పురాణాల రచయిత- వ్యాసుడు.
-అష్టాదశ పురాణాలు - 1) మార్కండేయ 2) మత్స్య 3) భవిష్య 4) భాగవత 5) బ్రహ్మ 6) బ్రహ్మాండ 7) బ్రహ్మవైవర్త 8) విష్ణు 9) వాయు 10) వరాహ 11) వామన 12) అగ్ని 13) నారదీయ 14) పద్మ 15) లింగ 16) గరుడ 17) కూర్మ 18) స్కాందపురాణం.
-వేదాలు అపౌరుషేయాలైతే పురాణాలు ఆర్షప్రోక్తాలు.
-కన్నడ రత్న త్రయంగా పేరొందిన కవులు పంప, పొన్న, రన్న.
-పొన్న రచించిన పురాణం- శాంతి పురాణం.
-రన్న రచించిన పురాణం- అజిత పురాణం.
-తమిళంలో వెలువడిన పురాణం- పెరియ పురాణం.
-తెలుగులో మొదటి దేశిపురాణం- బసవ పురాణం. దీన్ని రచించింది- పాల్కురికి సోమనాథుడు.
-ఎర్రన రచించిన నృసింహ పురాణంలో కనిపించేవి ప్రబంధ కవితారీతులు.
-తెలుగులో రాసిన తొలిపురాణం మార్కండేయ పురాణం. దీన్ని రచించింది మారన. ఇతను తిక్కన శిష్యుడు.
- నాగయ గన్ననికి అంకితమిచ్చిన పురాణం మార్కండేయ పురాణం
- మార్కండేయ పురాణాన్ని వచనరూపంలో రచించింది- కల్లూరి వెంకటసుబ్రహ్మణ్య దీక్షితులు.
- పురాణాలను వచనంలోకి అనువదించింది- ఏలూరిపాటి అనంతరామయ్య.
- వరాహపురాణం రచయితలు- నంది మల్లయ్య, ఘంట సింగన్న
- గరుడ పురాణం రచయిత- పింగళి సూరన
- విష్ణు పురాణ రచయిత- వెన్నెలకంటి సూరన.
- దేవీభాగవతాన్ని తెలుగులో రచించిన కవులు- 1) ములుగు పాపయారాధ్యులు 2) దాసు శ్రీరామకవి 3) తిరుపతి వేంకట కవులు.
- సూత పురాణం రచయిత- త్రిపురనేని రామస్వామి చౌదరి.
- బేతవోలు రామసుబ్రహ్మం రచించిన పురాణం- దేవీభాగవతం.
- కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన పురాణం- దేవీభాగవతం.
- విజ్ఞాన సర్వస్వాలవంటి పురాణాలు- గరుడ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం.
- చారిత్రకాంశాలు గల పురాణాలు- బ్రహ్మాండ, వాయు పురాణాలు.
- జనమంచి శేషాద్రి శర్మ రచించిన పురాణాలు- బ్రహ్మాండ, బ్రహ్మ పురాణాలు.
- శివపురాణం రచయిత- ముదిగొండ నాగవీరేశ్వర శాస్త్రి.
- తిక్కన శిష్యుడు- మారన.
- మార్కండేయ పురాణంలోని కథా ఘట్టాలు- వరూధినీ ప్రవరుల కథ, హరిశ్చంద్రోపాఖ్యానం, మహిషాసురమర్దనం, శుంభనిశంభులవధ.
- భాగవతాన్ని తెలుగులోకి అనువదించింది- బమ్మెర పోతన
- భాగవతంలోని భాగాలకు గల పేరు- స్కంధాలు.
- భాగవతంలోని స్కంధాల సంఖ్య- 12
- పోతన కాలం 15వ శతాబ్దం. జన్మస్థలం వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామం. తల్లి లక్కమాంబ, తండ్రి కేసనమంత్రి. బిరుదు సహజ పండితుడు. గురువు- ఇవటూరి సోమనారాధ్యుడు.
- పోతన రచనలు- 1) వీరభద్ర విజయం 2) భోగినీ దండకం 3) నారాయణ శతకం 4) ఆంధ్రమహాభాగవతం.
- తెలుగులో రాసిన తొలి స్వతంత్ర దండకం- భోగినీ దండకం.
- సర్వజ్ఞ సింగభూపాలుని ప్రేయసి- భోగిని
- పోతన భాగవతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు- శ్రీరామునికి.
- భాగవతంలోని శిథిలమైన భాగాలను రచించిన పోతన శిష్యులు- 1) బొప్పరాజు గంగన- 5వ స్కంధం 2) ఏర్చూరి సింగన- 6వ స్కంధం 3) వెలిగందుల నారన- 11, 12 స్కంధాలు.
- భాగవతంలోని పోతన రచించిన తొలిపద్యం- శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్.

పోతన పూర్వకవులను వర్ణించిన విధం
1) వాల్మీకి- ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి
2) వ్యాసుడు- నిగమనివహవిభాగ నిర్ణయ నిపుణుడు
3) బాణుడు- వచన రచన పల్లవితస్థాణుడు
4) కాళిదాసు- మహాకావ్యకరణైక కళావిలాసుడు
5) భారవి- కవితకులకమలవనరవి
6) నన్నయ- ఆంధ్రకవితా గౌరవజనమనోవిహారి
7) తిక్కన- హరిహర చరణారవింద వందనాభిలాషి, మనీషి
8) ఎర్రన- భక్త విశేషిత పరమేశ్వరుండగు ప్రబంధపరమేశ్వరుండు

- జగద్ధితంబుగన్ రచించెదనని చెప్పిన కవి- పోతన
- మహాభాగవతాన్ని పరీక్షిన్మహరాజుకు వినిపించినవారు- శ్రీశుకుడు.
- వ్యాసుని కుమారుడు- శ్రీశుకుడు.
- శమీక మహాముని కుమారుడైన శృంగి శాపానికి గురైనవాడు- పరీక్షిన్మహారాజు.
- భాగవతం ప్రకారం భగవంతుని అవతారాల సంఖ్య- 21. అవి 1)బ్రహ్మ 2) వరాహం 3) నారదుడు 4) నరనారాయణుడు 5) కపిలుడు 6) దత్తాత్రేయుడు 7) యజ్ఞుడు 8) ఉరుక్రముడు 9) పృథు చక్రవర్తి 10) మత్స్యం 11) కూర్మం 12) ధన్వంతరి 13) మోహిని 14) నరసింహ 15) వామనుడు 16) భార్గవ రాముడు 17) వ్యాసుడు 18) శ్రీరాముడు 19) బలరాముడు 20) శ్రీకృష్ణుడు 21) బుద్ధుడు.
- ఇతర పురాణాల ప్రకారం భగవంతుని అవతారాల సంఖ్య- 10. అవి 1) మత్స్య 2) కూర్మ 3) వరాహ 4) నరసింహ 5) వామన 6) పరశురామ 7) శ్రీరామ 8) శ్రీకృష్ణ 9) బుద్ధ 10) కల్కి

పోతన భాగవతంలో వర్ణించిన నవవిధ భక్తులు
- 1) శ్రవణం 2) కీర్తనం 3) విష్ణుస్మరణం 4) పాదసేవనం 5) అర్చనం 6) వందనం 7) దాస్యం 8) సఖ్యం 9) ఆత్మనివేదనం
- ధ్రువుని తల్లిదండ్రులు- సునీతి, ఉత్తానపాదుడు
- ప్రహ్లాదుని తల్లిదండ్రులు- లీలావతి, హిరణ్యకశిపుడు
- గజేంద్రుని మొసలి బారి నుంచి కాపాడినవాడు- విష్ణువు
- అంబరీషుడు ఎవరి భక్తుడు- విష్ణువు
- దేవకీ వసుదేవులకు ఎనిమిదో సంతానంగా జన్మించినవాడు- శ్రీకృష్ణుడు.
- వసుదేవుని భార్యల్లో ముఖ్యులు- దేవకి, రోహిణి.
- దేవకి కుమారుడు- శ్రీకృష్ణుడు.
- రోహిణి కుమారుడు- బలరాముడు, కూతురు- సుభద్ర.
- శ్రీకృష్ణుని సన్నిహితుడు- సాత్యకి. ఇతడు సత్యకి పుత్రుడు.
- శ్రీకృష్ణుని మేనత్త- దమఘోషుని భార్య సాత్వతి. ఈమె కుమారుడు- శిశుపాలుడు.
- శ్రీకృష్ణుని మేనమామ- కంసుడు. ఇతడి మామ- జరాసంధుడు.
- కంసుని చంపినవాడు- శ్రీకృష్ణుడు.
- శ్రీకృష్ణుని పెంపుడు తల్లిదండ్రులు- యశోద, నందుడు.
- బలరామకృష్ణులు ఎవరిదగ్గర విద్యాభ్యాసం చేశారు- సాందీపమహర్షి
- శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు, సహాధ్యాయి- కుచేలుడు
- శ్రీకృష్ణుని అష్ట భార్యలు- 1) రుక్మిణి 2) సత్యభామ 3) జాంబవతి 4) కాళింది 5) మిత్రవింద 6) నాగ్నజితి 7) భద్ర 8) లక్షణ.
- బలరాముని భార్య పేరు- రేవతి.
- నరకాసురుని చంపి పదహారువేల రాచకన్యలను బంధవిముక్తులను చేసినవాడు- శ్రీకృష్ణుడు.
- బాణాసురుని కూతురు ఉషను వివాహమాడినవాడు- శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుడు.
- పౌండ్రకవాసుదేవుని చంపినవాడు- శ్రీకృష్ణుడు.
- ముచుకుందుని కంటిమంటతో బూడిదైనవాడు- కాలయవనుడు.
- కంసునికి మాలలనందించినవాడు- సుధాముడు.

పోతన రచించిన సుప్రసిద్ధ పద్యాలు
1) కమలాక్షు నర్పించు కరములు కరములు
2) మందార మకరంద మాధుర్యమునదేలు
3) లావొక్కింతయు లేదు
4) ఎవ్వనిచే జనించు జగము
5) కలడందురు దీనులు యెడ
6) అలవైకుంఠ పురంబులో నగరిలో
7) సిరికింజెప్పుడు శంఖ చక్రయుగముం
8) ఇందుగలడందు లేడని సందేహమువలదు
9) ఇంతింతై వటుడింతై
10) నల్లనివాడు పర్మనయనంబులవాడు
11) నమ్మితి నామనంబున సనాతనులైన

భాగవతంలోని ప్రధాన ఘట్టాలు
1) కపిల మహర్షి వృత్తాంతం- తృతీయ స్కంధం
2) ధ్రువుని వృత్తాంతం- చతుర్థ స్కంధం
3) ప్రహ్లాద చరిత్ర- సప్తమ స్కంధం
4) గజేంద్ర మోక్షం- అష్టమ స్కంధం
5) మోహిని, వామన, మత్స్యవతారాల వృత్తాంతం- అష్టమ స్కంధం
6) అంబరీష, శ్రీరామ, పరశురామ, యయాతి, రంతిదేవుల వృత్తాంతం- నవమ స్కంధం
7) శ్రీకృష్ణ చరిత్ర- దశమ, ఏకాదశ స్కంధాలు

మాదిరి ప్రశ్నలు
1) పురాణం పంచలక్షణమని చెప్పినవాడు?
1) భారవి 2) భరతుడు
3) అభినవగుప్తుడు 4) అమరసింహుడు

2) రుషుల వృత్తాంతాలను వివరించేది?
1) సర్గ 2) ప్రతిసర్గ
3) వంశం 4) మన్వంతరం

3) 14 మంది మనువుల్లో రెండోవాడు?
1) స్వాయంభువ 2) స్వారోచిష
3) ఉత్తమ 4) తామస

4) భాగవతం అనేది?
1) పురాణం 2) ఇతిహాసం
3) కావ్యం 4) ప్రబంధం

5) కిందివాటిలో సరైనది కానిది?
1) సర్గ- సృష్టి 2) ప్రతిసర్గ- పునఃసృష్టి
3) వంశానుచరితం- రుషుల వృత్తాంతం
4) మన్వంతరం- 14మంది మనువుల వృత్తాంతం

6) తెలుగులో మొదటి దేశిపురాణం?
1) మార్కండేయ పురాణం
2) బసవ పురాణం
3) నృసింహ పురాణం
4) మత్స్య పురాణం

7) తెలుగులో తొలి పురాణ రచయిత?
1) తిక్కన 2) మారన 3) ఎర్రన 4) పోతన

8) వరాహ పురాణం రచించిన కవి?
1) నంది మల్లయ్య 2) ఘంట సింగన్న
3) 1, 2 4) పింగళి సూరన

9) విజ్ఞాన సర్వస్వాలవంటి పురాణాలు?
1) గరుడ పురాణం 2) అగ్ని పురాణం
3) నారద పురాణం 4) పైవన్నీ
krishnakaudinya10) బేతవోలు రామబ్రహ్మం రచించిన సుప్రసిద్ధ పురాణం?
1) భాగవతం 2) దేవీభాగవతం
3) మార్కండేయ పురాణం
4) బ్రహ్మాండ పురాణం
సమాధానాలు:
1-4, 2-3, 3-2, 4-1, 5-3, 6-2,
7-2, 8-3, 9-4, 10-2

0 comments:

Post a comment