Friday, 27 November 2015

మీ మైండ్‌కు మీరే బాస్ student preparation Student Guideఇంతకాలం మిమ్మల్ని నెగెటివ్ భావాలతో శాసించిన మీ మైండ్‌ను ఈ ఆడియో టేపు ఫార్ములాతో మీకు అనుకూలంగా చేసుకోవచ్చు. మీకు మీ మైండ్ బాస్‌లా కాకుండా మీరే మీ మైండ్‌కు బాస్ అవుతారు. మీ మైండ్‌కి ఎలా ఆలోచించాలో మీరే నేర్పిస్తారు. మీరు కోరుకున్న ఉజ్వల భవిష్యత్‌ను మీ మైండ్ మీకు అందించేలా చేస్తారు.

మన మైండ్‌తో నిరంతం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మనస్సుకు తోచిన ఆలోచనలు తికమకగా వస్తుంటాయి. వీటికి తల, తోక అంటూ ఉండదు. కాసేపటి క్రితం జరిగిన సంగతిని ఆలోచిస్తూనే హఠాత్తుగా, అత్యంత వేగంతో పదేళ్ల క్రితం జరిగిన మరో విభిన్నమైన సంగతిని గురించి ఆలోచించడం మొదలుపెడతాం. అందుకే మనస్సు కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తుందని అంటారు. ఈ క్రమంలో ఆలోచనలతో పాటూ మనం, ఇంటర్నల్‌గా పలు రకాల వ్యాఖ్యలు, మనపై మనం చేసుకునే దూషణలు, భూషణలు అనేకం చోటు చేసుకుంటాయి. ఫలానా అంశంపై ఏర్పడిన అభిప్రాయం, ఆ అంశం పదేపదే గుర్తుకు వచ్చినప్పుడల్లా రింగు రింగు మంటూ రిపీట్ అవుతూనే ఉంటుంది.

ఉదాహరణకు ఫలానా విషయంలో నేను చాలా తెలివితక్కువగా ప్రవర్తించాను అని మీరు భావిస్తే ఆ సంగతి గుర్తుకువచ్చినప్పుడల్లా తెలివితక్కువగా ప్రవర్తించడమే పలుమార్లు రిపీట్ అయి నేను తెలివి తక్కువవాడిని అనే అఫర్మేషన్ సుస్థిరమవుతుంది. క్రమంగా మీ అంతరంగం మీరు ఒక తెలివి తక్కువ వ్యక్తిగానే పరిగణిస్తున్నది. పరీక్షల్లో సరిగ్గా ఎటెంప్ట్ చేయలేకపోయిన సన్నివేశం గుర్తుకువచ్చినప్పుడల్లా సమయానికి గుర్తుకు రాక రాయలేక పోయాను అని పదేపదే అనుకోవడంతో మీ అంతరంగం మీకే విషయం సమయానికి గుర్తు రాదనే భావిస్తున్నది. క్రమంగా మీరు మతిమరుపు మనిషిగా మారడానికి ఎంతో కాలం పట్టదు.

ఈ నెగెటివ్ అభిప్రాయాలను మీ చుట్టూ ఉన్న వారు మీపై చేసే నెగెటివ్ కామెంట్లు కూడా తోడవుతాయి. అందుచేత పాజిటివ్ పవర్‌ని మేలుకొల్పేటప్పుడు మీరు ముందుగా చేయవలసింది ఇతరులు మీపై చేసిన కామెంట్లను పక్కన పెట్టేయడం. మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఇందుకు ఆడియో టేప్ ఫార్ములా బాగా ఉపయోగపడుతున్నది. మీ గురించి మీరు మననం చేసుకునేటప్పుడు పాజిటివ్ ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రమే మననం చేసుకోవాలి. ఇది ఆలోచనా క్రమంలో ఒక అలవాటుగా మారాలి. అందుకు మీరు స్వయంగా చేసే సాంకేతిక ప్రయత్నమే ఆడియో టేప్.

వాయిస్ పవర్
మీ వాయిస్ మీరు ఎప్పుడైనా విన్నారా? అఫ్‌కోర్స్ వినే ఉంటారు. అలా విన్న మీ వాయిస్‌లో మీలో చాలా మందికి నచ్చి ఉండదు. మీపై మీకు గత తక్కువ అభిప్రాయం ఎటువంటిదో ఇక్కడే రుజువు అవుతున్నది. మీ వాయిస్‌ను మీరు ఎప్పుడు గొప్ప వాయిస్‌గా గ్రహిస్తారో అప్పుడు మీరంటే మీకు ఇష్టం పెరుగుతున్నది. అది ఈ ఎక్సర్‌సైజుకు చాలా అవసరం. ఎందుకంటే మీ అంతరంగానికి మీరు ఏమైనా సందేశం ఇవ్వదిలిస్తే దానిని మీ సొంత గొంతుతోనే అందివ్వడం చాలా పవర్‌ఫుల్ మీడియాగా ఉపయోగపడుతున్నది. అఫర్మేషన్లు మీ సొంత గొంతులో దృఢంగా ధ్వనిస్తాయి. మీకు కావాల్సిందేమిటో ఆ గొంతులో స్పస్టం అవుతున్నది.

మీ సొంత ప్రోగ్రామ్ కలిగన టీమ్
ఈ ప్రోగ్రామ్‌లో మీరు మీ సొంత వాయిస్‌ను రికార్డు చేస్తూ ఒక ఆడియో టేపును మీరు తయారుచేసుకోవాలి. ఆ క్యాసెట్‌ను మీరు ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వీలైనప్పుడల్లా వింటూ ఉండాలి. దీనికి ఫలానా టైమ్‌లోనే చేయాలని ఏమి లేదు. అలాగే వీటికి ఒక కొత్త పాఠం వింటున్నట్టుగా మీ దృష్టి అంతా కేంద్రీకరించి విననక్కర్లేదు. మీరు హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు లేదా చదువుకుంటున్నప్పుడో లేదా టీవీ రిపీటెడ్‌గా మీ మనస్సుకు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో దాగిఉన్న సందేశాన్ని మీ అంతరంగం దాన్ని నిజంగానే నమ్ముతున్నది. ఈ విధంగా ఇంతవరకు మీ ప్రయత్నం లేకుండానే మీ మైండ్‌లో తిరుగుతున్న ఇంటర్నల్ టేపుకు ప్రత్యామ్నయంగా ఈ ఆడియోటేపు పాజిటివ్ ప్రభావాన్ని కలిగిసున్నది.

క్యాసెట్ ఎలా ఉండాలి
మీ క్యాసెట్‌కు మీరు 7-7-7 టేప్ అని పేరు పెట్టండి. ఇందులో 7 స్టేట్‌మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఏడుసార్లు రిపిట్ అవుతాయి. మధ్యలో 7 సెకన్ల పాటు విరామం ఇవ్వాలి. మొత్తం మీద మీ క్యాసెట్ నిండా 49 స్టేట్‌మెంట్లు చేయబడి ఉంటాయి. ఒక్కొక్క స్టేట్‌మెంట్‌కి 7 సెకన్లు గ్యాప్ ఇవ్వాలి. ఆ సమయంలో మీరు అందించిన అఫర్మేషన్‌ని మీ మైండ్ రిసీవ్ చేసుకుని ఒక ఇమేజ్‌ని సృష్టించగలుగుతున్నది. ఆ తర్వాత అదే అఫర్మేషన్‌ని రిపీట్ చేయడంతో ఆ ఇమేజ్ మరింత బలంగా తయారవుతుంది.

క్రమంగా ఆ ఇమేజ్ మీ అంతరంగంలో రీప్రోగ్రామింగ్ ప్రభావాన్ని కలిగిస్తున్నది. రిపిటేషన్‌కు మధ్య 7 సెకన్లు గ్యాస్ ఇవ్వడం కూడా ప్రధానం. ఎక్కువ స్టేమ్‌మెంట్స్ ఉన్నా, మీకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. అఫర్మేషన్ల ఉద్వేగ బలం తగ్గిపోతున్నది. ఫలితంగా ఈ ఎక్సర్‌సైజు నిరుపయోగమవుతున్నది. 7 అంకెను గుర్తుంచుకోవడం సులభం. మీరు ఒక్కో స్టేట్‌మెంట్‌ని తొమ్మిదేసి సార్లు రిపిట్ చేసుకొంటూ, ఒక్కొక్క స్టేట్‌మెంట్‌కి 10 సెకన్ల విరామం ఎక్కువ సేపు ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాల రికార్డింగ్ టైమ్ ఉంటుంది. రిపిటేషన్ల సంఖ్య తగ్గి, విరామ సమయాన్ని తగ్గించినా, అఫర్మేషన్ల ప్రభావం బలంగా ఉండదు. మన లక్ష్యం అఫర్మేషన్ల ప్రభావం బలంగా ఉండాలి.

అందుచేత 7-7-7 సూత్రాన్ని మర్చిపోకండి. మీ సొంత అఫర్మేషన్ల+ మీ సొంత గొంతు+ మీ మైండ్= మీ విజయం. ఈ సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈప్రోగ్రాం నిత్యకృత్యంలా ప్రాక్టీసు చేయండి. ఒక అరగంట దీనికి కేటాయించండి. వాక్‌మెన్‌ని ఉపయోగించండి. అఫర్మేషన్లలో బ్యాలెన్స్ తప్పనిసరిగ్గా ఉండాలి. ఎందుకంటే మీ అభివృద్ధి ఆల్‌రౌండ్‌గా ఉండాలి కాబట్టి. 7 రకాల విషయాలకు సమానమైన ప్రాతినిధ్యమిస్తూ ఆడియో టేప్‌లో అఫర్మేషన్లు ఎలా ఉండాలో ఉదాహరణ నమూనాని తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం

0 comments:

Post a Comment