Friday, 2 October 2015

ONGC 500 scholarships Telangana Jobs ఓఎన్‌జీసీ 500 స్కాలర్‌షిప్స్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ప్రతిభావంతులైన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను ప్రకటించింది.
వివరాలు: ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వీటిని ప్రదానం చేస్తారు.
ఇంజినీరింగ్, మెడికల్ స్ట్రీమ్, రెండేండ్ల ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ చదువుతున్నవారికి వీటిని ఇస్తారు.
స్టయిఫండ్: నెలకు రూ. 4000/- చొప్పున ఏడాదికి రూ. 48,000/- ఇస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఐదుజోన్లకు 100 చొప్పున ఈ స్కాలర్‌షిప్స్‌ను కేటాయించారు.
అర్హతలు: ప్రొఫెషనల్ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు
అర్హత పరీక్షల్లో (ఇంటర్/డిగ్రీ) కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 4.50 లక్షలకు మించరాదు
అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏండ్లు మించరాదు
ఏ ఇతర స్కాలర్‌షిప్స్‌ను పొందుతూ ఉండరాదు
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేసి 2016, జనవరి మూడో వారంలో అర్హుల జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
పూర్తి చేసిన దరఖాస్తులను 2015, నవంబర్ 15లోగా పంపాలి.
వెబ్‌సైట్: www.ongcindia.con

0 comments:

Post a Comment