Friday, 27 March 2015

Filpcart Recruitment 2015 Above 20 Lakh jobs Flip cart - 20 lakh jobs ఫ్లిప్ కార్ట్ – 20 లక్షల ఉద్యోగాలు

స్మార్ట్ ఫోన్ల రాకతో వ్యాపార నమూనాలే మారిపోయాయి. ఇప్పుడు షాపింగ్ అంటే అంతా కంప్యూటర్ పైనే.. అందుకే ఈ కామర్స్ వెబ్ సైట్లు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. వీటి వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. వేలకోట్ల రూపాయల టర్నోవర్ తో బడా వ్యాపార సామ్రాజ్యాలుగా మారుతున్నాయి. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ విస్తరణలో భాగంగా.. ఈ ఏడాది 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాల సేవల ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. వీటిలో లాజిస్టిక్స్, వేర్‌హౌస్ విభాగాలలో దాదాపు 60 శాతం ఉద్యోగాలు రానున్నాయని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేసింది. తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయదారులే రవాణా విభాగంలో డ్రైవింగ్ తదితర ఉద్యోగాలను కల్పిస్తారని పేర్కొంది. ఈ-కామర్స్ రంగంలోని ప్యాకేజింగ్, క్యాటలాగింగ్ తదితర విభాగాల్లో గతేడాది 75,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అంకిత్ నాగోరి తెలిపారు. జైపూర్, బరోడా వంటి పట్టణాల్లో ఇప్పటికే క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాలు వృద్ధి చెందాయని, ఇవి భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలకు కేంద్రాలుగా మారతాయన్నారు. విక్రయదారులు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. గృహోపకరణ ఉత్పత్తులు, దుస్తులు, మొబైల్ ఉపకరణాలు తదితర విక్రయదారులే ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టిస్తారని చెప్పారు.

0 comments:

Post a Comment